వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతిపక్షాలపై కేసీఆర్ బ్రహ్మాస్త్రం: రేవంత్ - బండి వాట్ నెక్స్ట్: ఢిల్లీ దిశగా అడుగులు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

అంతుచిక్కని రాజకీయ వ్యూహాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సీఎం కేసీఆర్ మరో అస్త్ర ప్రయోగించారు. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఎక్కు పెట్టిన ఆయుధాన్నే తిరిగి ఇప్పుడు కేసీఆర్ తన అస్త్రంగా మలచుకున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగాల నియామకాల పైన వచ్చిన విమర్శలకు ఒకే ఒక ప్రకటనతో సమాధానం ఇచ్చారు. తన ప్రకటన పైన ముందుగానే తానే బయటకు చెప్పి మరింత ఉత్కంఠ పెంచారు. చెప్పిన విధంగానే అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేసారు. ఏకంగా 91 వేల ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచే నియామక ప్రక్రియకు వీలుగా ప్రకటన చేసారు.

Recommended Video

Telangana Job Notifications: ఎన్నికల టైం CM KCR Big Announcement | Assembly Sessions |OneindiaTelugu
కేసీఆర్ సరి కొత్త వ్యూహంతో

కేసీఆర్ సరి కొత్త వ్యూహంతో

అంతే కాదు మరో 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో పదేళ్ల వయో పరిమితి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతటితో ఆగలేదు. ఏకంగా 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తూ సంచలన ప్రకటన చేసారు. ఇక, కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండవని స్పష్టం చేసారు. రైతుల అంశంలో కేంద్రాన్ని టార్గెట్ చేసి..వడ్ల కొనుగోలులో అంశంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన కేసీఆర్..ఇప్పుడు యువతను ఆకట్టుకొనే వ్యూహానికి తెర లేపారు. రైతులను తమ వైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ - బీజేపీ వ్యూహాలకు చెక్ పెట్టారు. ఇక, ఇప్పుడు యువతలో నెలకొన్న అసంతృప్తి ని ప్రతిపక్ష పార్టీలు క్యాష్ చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాయని గ్రహించారు. అంతే, ఒకే సారి నిరుద్యోగ యువతకు బొనాంజ ప్రకటించారు.

ప్రతిపక్షాలకు ఆ ఛాన్స్ లేకుండా

ప్రతిపక్షాలకు ఆ ఛాన్స్ లేకుండా

ఉద్యోగ ప్రకటనలో ఎక్కడా అనుమానాలు..సందేహాలకు అవకాశం లేకుండా విస్పష్టంగా..పూర్తి వివరణతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసారు. దీంతో..నిరుద్యోగుల అంశాన్ని కొంత కాలంగా హైలైట్ చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి.. బండి సంజయ్..షర్మిలకు ఒకే నిర్ణయంతో సమాధానం చెప్పారు. అయితే, ఇక ఇప్పుడు ప్రతిపక్షాలకు మిగిలింది ఒకటే అంశం. అది నిరుద్యోగ భృతి. దీని పైన నిరసనలకు ప్రతిపక్షాలు సిద్దమయ్యే అవకాశం ఉంది. అయితే, దీని పైన కేసీఆర్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఆర్దిక సంవత్సరం నుంచి దీనిని అమలు చేసే దిశగా సిద్దంగా ఉన్నారని అధికార పార్టీలో చర్చ సాగుతోంది. ఇప్పటికే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలా వద్దా.. దేశం కోసం తన వంతు పాత్ర పోషించాలా వద్దా అంటూ ప్రతీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ప్రజల నుంచి సానుకూలంగా స్పందన వస్తోంది. దీంతో..ముందు తన సొంత గడ్డ పైన తనకు తిరుగు లేకుండా అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేసారు.

తరచూ ప్రజల్లోకి ముఖ్యమంత్రి

తరచూ ప్రజల్లోకి ముఖ్యమంత్రి

పరోక్షంగా ఎన్నికల్లో తమ అభ్యర్ధులను గెలిపించాలని కేసీఆర్ అడగటం ప్రారంభించటం ద్వారా ఆయన ఆలోచనలు - వ్యూహాలు ఏంటనేది స్పష్టం అవుతున్నాయి. వనపర్తి సభలో తమ అభ్యర్ధి మంత్రి నిరంజన్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు. దీని ద్వారా కేసీఆర్ ఎన్నికలకు ముందుగానే సిద్దం అవుతున్నట్లుగా సంకేతాలు స్పష్టం అవుతున్నాయి. జాతీయ రాజకీయాల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని భావిస్తున్న కేసీఆర్..ఇక, ఢిల్లీ దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే... తెలంగాణ యువతను ఆకట్టుకొనేలా 95 శాతం పోస్టులకే స్థానికులకు అనే నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన అయిదు శాతంలో నాన్ లోకల్ అనేది కాకుండా.. ఓపెన్ కేటగిరీగా చెప్పుకొచ్చారు.

కేసీఆర్ తరువాతి అడుగులు ఢిల్లీ వైపేనా

కేసీఆర్ తరువాతి అడుగులు ఢిల్లీ వైపేనా

ఇప్పుడు కేసీఆర్ ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకోవటంతో..ఇక, ప్రతిపక్షాలకు ఉద్యోగాల భర్తీ అంశం నినాదం కోల్పోయినట్లేనని గులాబీ నేతలు చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకోవటానికి అటు రేవంత్.. బండి సంజయ్ సైతం పదేళ్ల కేసీఆర్ పాలన పైన సహజంగా ఏర్పడే వ్యతిరేకత తమకు అనుకూలగా మలచుకొనేందుకు పోటీ పడుతున్నారు. అయితే, కేసీఆర్ మాత్రం ఏ వర్గం నుంచి తమకు వ్యతిరేకత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో..ఇప్పుడు ప్రతిపక్షాలు ఈ నిర్ణయం పైన ఏ విధంగా స్పందిస్తాయి.. కేసీఆర్ తదుపరి అడుగులు ఏంటనేది తెలంగాణ రాజీకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
CM KCR had put the opposition leaders Revanth and Bandi Sanjay by announcing to fill the jobs in Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X