వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ: ధాన్యం కొనుగోలుపై ఎఫ్‌సీఐ విధానాలతోనే గందరగోళం, చర్యలు తీసుకోండి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో, రైతన్నల నుండి ధాన్యం కొనుగోలు పై రగడ కొనసాగుతున్న తరుణంలో బీజేపీపై యుద్ధం చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి ధాన్యం కొనుగోలుపై లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్లపై ఎఫ్సీఐ కి ఆదేశాలు ఇవ్వాలని మోడీకి సీఎం కేసీఆర్ రాసిన లేఖలో పేర్కొన్నారు. పరిస్థితి చేయి దాటిపోతుందని, పరిస్థితిని అర్థం చేసుకోవాలని ప్రధాని మోడీకి రాసిన లేఖలో సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళ రగడ: కర్షకుడా.. కదిలిరా అంటూ కాంగ్రెస్; బీజేపీకి పోటీగా..ఎవరి తిప్పలు వారివే !!తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళ రగడ: కర్షకుడా.. కదిలిరా అంటూ కాంగ్రెస్; బీజేపీకి పోటీగా..ఎవరి తిప్పలు వారివే !!

 తెలంగాణా ప్రభుత్వ పథకాల వల్ల సాగుబడిలో సత్ఫలితాలు

తెలంగాణా ప్రభుత్వ పథకాల వల్ల సాగుబడిలో సత్ఫలితాలు

సీఎం కేసీఆర్ మోడీకి రాసిన లేఖలో పేర్కొన్న అంశాలను చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుండి వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి సాధించిందని కెసిఆర్ లేఖలో పేర్కొన్నారు. వినూత్న విధానాలతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల మూలంగా వ్యవసాయ రంగంలో ఇంతటి అభివృద్ధి సాధ్యం అయిందని పేర్కొన్న ఆయన, 24 గంటల పాటు నాణ్యమైన కరెంటునివ్వడమే కాకుండా ఏడాదికి ఎకరానికి పది వేల రూపాయల పంట పెట్టుబడి ప్రోత్సాహకాన్ని తెలంగాణ రైతులకు రాష్ట్రప్రభుత్వం అందిస్తుందని లేఖలో స్పష్టం చేశారు. కష్టజీవులైన తెలంగాణ రైతులు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను తీసుకుని గుణాత్మక దిగుబడిని సాధిస్తున్నారు అని, తద్వారా దేశ ప్రగతికి తోడ్పడుతున్నారు అని సీఎం కేసీఆర్ తన లేఖ ద్వారా స్పష్టం చేశారు.

 రాష్ట్రం ఏర్పాటు కాక ముందు రైతన్నల పరిస్థితి, ఇప్పటి పరిస్థితి వివరించిన కేసీఆర్

రాష్ట్రం ఏర్పాటు కాక ముందు రైతన్నల పరిస్థితి, ఇప్పటి పరిస్థితి వివరించిన కేసీఆర్

ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందు తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని ఆయన లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందే ఎక్కడ చూసినా తెలంగాణలో కరువుకాటకాలు తాండవించేవని, సాగునీటి వసతులు సరిగా లేక పంటలు సరిగా పండేవి కాదని పేర్కొన్న సీఎం కేసీఆర్ నేడు రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన సాగునీటి లభ్యత కారణంగా తెలంగాణ రాష్ట్రం తమ అవసరాలను మించి ఆహారధాన్యాల ఉత్పత్తిలో మిగులు రాష్ట్రంగా నిలిచిందని స్పష్టం చేశారు. తెలంగాణా బంగారు పంటలను పండిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రైతు నేడు దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన ప్రగతి ప్రస్థానం గురించి మీకు తెలియనిది కాదని సీఎం కేసీఆర్ లేఖ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీకి తెలియజేశారు.

ఎఫ్‌సీఐ అసంబద్ధ విధానాలతో అయోమయానికి గురి చేస్తుందన్న కేసీఆర్

ఎఫ్‌సీఐ అసంబద్ధ విధానాలతో అయోమయానికి గురి చేస్తుందన్న కేసీఆర్

ఇక ఇదే సమయంలో భారత ఆహార సంస్థ అసంబద్ధ విధానాలను అవలంభిస్తోందని, సురక్షిత నిల్వలను కొనసాగిస్తూ, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, గోధుమలు వంటి ధాన్యాలను పంపిణీ చేస్తూ, దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించాల్సిన ఎఫ్‌సీఐ అటు రైతులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను అయోమయానికి గురి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో కెసిఆర్ ఎఫ్సీఐ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. భారత ఆహార సంస్థ ఏడాదికి సరిపడా ధాన్యం సేకరించే లక్ష్యాలను ఒకేసారి నిర్ధారించటం లేదని, ప్రతియేటా ధాన్యం దిగుబడి పెరుగుతుందని తెలిసినా ధాన్యాన్ని సేకరించడం వేగవంతంగా చెయ్యటం లేదని, ఎస్బిఐ అనుసరించే అయోమయ విధానాల వల్లనే రాష్ట్రాలు, రైతులకు సరైన పంటల విధానాన్ని సూచించలేక పోతున్నాయని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణాలో సాగైన ధాన్యం కొనుగోలు విషయంలో ఎఫ్సీఐ తీరుపై అసహనం

తెలంగాణాలో సాగైన ధాన్యం కొనుగోలు విషయంలో ఎఫ్సీఐ తీరుపై అసహనం

2021 వానకాలం సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో 55 .75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయిందని అందులో కేవలం 32.66 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే భారత ఆహార సంస్థ సేకరించిందని తెలిపారు. పండిన పంటలో కేవలం 59 శాతం మాత్రమే ధాన్యాన్ని ఇప్పటివరకు సేకరించింది అని పేర్కొన్నారు. ఇది ఖరీఫ్లో సేకరించిన ధాన్యం కంటే 78 శాతం తక్కువని పేర్కొన్నారు. ఇంత విపరీతమైన తేడాలు ఉంటే రాష్ట్రంలో సరైన పంట విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశానన్న సీఎం కేసీఆర్

కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశానన్న సీఎం కేసీఆర్

ఇలాంటి గందరగోళ పరిస్థితులు తొలగించి ధాన్యం సేకరణలో నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్ధారించారని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారిని సెప్టెంబర్ 25, 26 వ తారీఖులలో తానే స్వయంగా వెళ్లి కలిశాను అని పేర్కొన్నారు. వార్షిక ధాన్య సేకరణ లక్ష్యాన్ని తక్షణమే నిర్ధారించాలని మంత్రి పీయూష్ గోయల్ ను విజ్ఞప్తి చేశానని కేసీఆర్ తెలిపారు. కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసి 50 రోజులు దాటినా ఇప్పటివరకు ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోలేదని కెసిఆర్ తన లేఖ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లారు.

Recommended Video

AP Cabinet : APలో కేబినెట్ విస్తరణ.. ప్రశాంత్ కిషోర్ మంత్రాంగం..!! || Oneindia Telugu
ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇవ్వండి .. తక్షణం చర్యలు తీసుకోండి

ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇవ్వండి .. తక్షణం చర్యలు తీసుకోండి

ఇక ఇదే సమయంలో ధాన్యం సేకరణకు సంబంధించి భారత ఆహార సంస్థకు ఆదేశాలు ఇవ్వవలసిందిగా పేర్కొన్న సీఎం కేసీఆర్ 2020 2021 ఎండాకాలం సీజన్లో సేకరించ కుండా మిగిలి ఉంచిన ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని పేర్కొన్నారు. పంజాబ్ రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణలో కూడా 2021- 2022 వానాకాలంలో పండిన పంటలో 90% వరి ధాన్యాన్ని సేకరించాలని తెలిపారు. నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించటం అనే నిబంధనను మరింతగా పెంచి ధాన్యం సేకరించాలని కేసీఆర్ మోడీకి విజ్ఞప్తి చేశారు .రాష్ట్రాల నుండి కొనుగోలు చేసే ధాన్యంపై ముందే ఎఫ్సిఐ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు . వచ్చే అసెంబ్లీ లో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఎంత వరిధాన్యం ఉంటుందో ముందుగానే నిర్ణయించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు సత్వరమే చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ కి విజ్ఞప్తి చేశారు.

English summary
CM KCR wrote a letter to Prime Minister Modi on the purchase of paddy. CM KCR appealed to Modi to give directions to the FCI on paddy procurement and to understand the situation and take action as confusion would arise with the FCI policies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X