Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉపరాష్ట్రపతిగా కేసీఆర్ - తెలంగాణ సీఎంగా కేటీఆర్ : బీజేపీతో మైత్రి-కేంద్ర మంత్రిగా హరీష్..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా అసెంబ్లీలో తన ప్రసంగంలో కేంద్ర రాజకీయాలు..టీఆర్ఎస్ ప్రమేయం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన గత నెలలో రెండు సార్లు ఢిల్లీ యాత్ర చేసారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ సిద్దం అవుతోంది. జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని కేసీఆర ఆలోచన చేస్తున్న విషయం గత సార్వత్రిక ఎన్నికలకు ముందే స్పష్టం అయింది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే, అది థర్డ్ ప్రంట్ అనో..మరొకటో కాదని తేల్చి చెప్పారు. అయితే, కేంద్రంలో తిరిగి పూర్తి మెజార్టీతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటంతో కేసీఆర్ ఆలోచనలు ఆచరణలోకి రాలేదు.

ఢిల్లీ కేంద్రంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారంటూ

ఢిల్లీ కేంద్రంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారంటూ

ఇక, రెండో సారి సీఎంగా అయిన తరువాత కొద్ది కాలంగా ఆయన వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోంది. తెలంగాణలో ప్రభుత్వం పరంగా వరుసగా వరాలు ప్రకటిస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీ రాజకీయాల పైన కన్ను వేసారు. ఆయన గత నెలలో తెలంగాణ భవన్ భూమి పూజ కోసం వెళ్లిన సమయంలో దాదాపు వారం రోజుల పాటు అక్కడే మకాం వేసారు. ప్రధాని మోదీ..అమిత్ షా.. కేంద్ర మంత్రులను కలిసారు. అయితే, ఢిల్లీ కేంద్రంగా కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారనే ప్రచారం సాగింది.

ఉప రాష్ట్రపతిగా కేసీఆర్..

ఉప రాష్ట్రపతిగా కేసీఆర్..

ఇక, ఇప్పుడు కొత్త అంశాలు తెర పైకి వస్తున్నాయి. గతంలో ఒక సారి జరిగిన ప్రచారం ఇప్పుడు తిరిగి తెర మీదకు వచ్చింది. కేసీఆర్ ఉప రాష్ట్రపతి కావాలని కోరుకుంటున్నారని..బీజేపీ పెద్దల నుంచి సానుకూలత ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు మీడియాలో కధనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉప రాష్ట్రపతి గా ఉన్న వెంకయ్య నాయుడు పదవీ కాలం పూర్తయిన తరువాత ఆయన స్థానంలో మరో తెలుగు వ్యక్తిగా..దిక్షిణాదికి చెందిన కేసీఆర్ కు అవకాశం దక్కనుందని ఆ కధనం సారాంశం.

బీజేపీతో టీఆర్ఎస్ కలుస్తుందంటూ

బీజేపీతో టీఆర్ఎస్ కలుస్తుందంటూ

ఇదే సమయంలో తనకు ఉప రాష్ట్రపతిగా అవకాశం ఇస్తే..బీజేపీతో కలవటానికి కేసీఆర్ కు అభ్యంతరం ఉండదనే వాదన తెర మీదకు వచ్చింది. ఇక, ఇదే సమయంలో కేటీఆర్ ను తెలంగాణకు ముఖ్యమంత్రి చేయాలనేది కొంత కాలంగా పార్టీలో వినిపిస్తున్న డిమాండ్. ఆ డిమాండ్ కు పార్టీ సమావేశంలో కేసీఆర్ స్వయంగా ముగింపు పలికారు. అయితే, కేసీఆర్ ఉప రాష్ట్రపతిగా అవకాశం వస్తే ..ఇక్కడ కేటీఆర్ కు లైన్ క్లియర్ అయినట్లేనని చెబుతున్నారు. కేటీఆర్ రాజకీయ భవిష్యత్ కోసమే ముందుగా ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చారు.

కేటీఆర్ ఇక్కడ..హరీశ్ అక్కడ

కేటీఆర్ ఇక్కడ..హరీశ్ అక్కడ

అటు పార్టీలో..ఇటు ప్రభుత్వంలో ఇప్పుడు కేటీఆర్ క్రియాశీలకంగా మారారు. ఒక విధంగా పార్టీని ఆయనే హ్యాండిల్ చేస్తున్నారు. ఇక, కేటీఆర్ కు రాజకీయంగా భవిష్యత్ లోనూ ఎక్కడా ఇబ్బందులు రాకుండా... తన మేనల్లుడు హరీష్ ను కేంద్ర కేబినెట్లోకి పంపాలని కేసీఆర్ భావిస్తున్నారని ఆ కధనంలో పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా బీజేపీతో విభేదిస్తున్నారు. అయితే, కేంద్రంలో మాత్రం ప్రధాని మోదీ- హోం మంత్రి అమిత్ షా తో సత్సంబంధాలు కంటిన్యూ చేస్తున్నారు.

కేసీఆర్ ఆలోచన ఇదేనంటూ కధనాలు

కేసీఆర్ ఆలోచన ఇదేనంటూ కధనాలు

అయితే, అవి కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలే కానీ, రాజకీయ సంబంధాలు కావనేది తెలంగాణ బీజేపీ నేతల వాదన. ఇదే సమయంలో కొంత కాలంగా బీజేపీ నేతలనే లక్ష్యంగా చేసుకొని టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు సంధిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ సైతం కేసీఆర్ బీజేపీతోనే ఉన్నారంటూ పలు సందర్భాల్లో ఆరోపించారు. అయితే, ఇప్పటి వరకు తెలుగు వ్యక్తికే ఉప రాష్ట్రపతి పదవి ఇచ్చి.. మరలా తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతకే తిరిగి ఉప రాష్ట్రపతి పదవి ఇస్తారా.. అదే జరిగితే మరి వెంకయ్యనాయుడుకు దక్కే పదవి ఏంటి... ఇలా కేసీఆర్ కు ఉప రాష్ట్రపతి... హరీశ్ కు కేంద్ర మంత్రి పదవి..ఇవన్నీ ఒకే కుటుంబానికి చెందిన వారికి ఇవ్వటం సాధ్యమేనా అనే చర్చ సాగుతోంది.

అధికారం తమదే అంటున్న బీజేపీ

అధికారం తమదే అంటున్న బీజేపీ

తాజాగా తెలంగాణలో పర్యటించిన కేంద్ర మంత్రి అమిత్ షా సైతం వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని చెబుతున్నారు. అయితే, కేంద్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గతంలో వచ్చిన సీట్లు రావనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో..మిత్రపక్షాల మద్దతు అవసరం. అందులో భాగంగా దక్షిణాదిన తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వైసీపీ..టీఆర్ఎస్ కు చెందిన ఎంపీలు కీలకం కానున్నారు.

Recommended Video

    AP CM Has Maintained His Cool In Pawan Kalyan Matter | Oneindia Telugu
    కొత్త సమీకరణాలు..సాధ్యమయ్యేనా

    కొత్త సమీకరణాలు..సాధ్యమయ్యేనా

    దీంతో..కేసీఆర్ కు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వటం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపీల మద్దతు తమకే ఉంటుందని బీజేపీ నేతలు ఆశిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే, ఈ కధనాల పైన టీఆర్ఎస్ నేతలు అధికారికంగా స్పందించాల్సి ఉంది. గతంలోనూ కేసీఆర్ కు ఉప రాష్ట్రపతి పదవి దక్కుతుందనే ప్రచారం సాగింది. అయితే, ఇప్పుడు తిరిగి కేంద్రంలో ఉన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మరో సారి ఈ చర్చ తెర పైకి వచ్చింది. ఇక, దీని పైన అటు బీజేపీ..ఇటు గులాబీ పార్టీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+