సెంటిమెంట్ తప్పని సీఎం కేసీఆర్ - అక్కడే నామినేషన్ పై సంతకాలు..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వెంకన్న సన్నిధిలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల్లో నామినేషన్ వేసే ప్రతిసారి కేసీఆర్ ఈ ఆలయంలో పూజలు చేస్తూ వస్తున్నారు. ఈ నెల 9న గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో నామినేషన్లు వేయనున్నారు. అదేరోజు బీఆర్‌ఎస్ ఆశీర్వాదసభల్లో పాల్గొననున్నారు.
సెంటిమెంట్ కొనసాగింపు: ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అదే సెంటిమెంట్ తో ముందుకు సాగుతున్నారు. కోనాయిపల్లి వెంకన్న సన్నిధిలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల్లో నామినేషన్ వేసే ప్రతిసారి కేసీఆర్ ఈ ఆలయంలో పూజలు చేస్తూ వస్తున్నారు.ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీశ్ రావు స్వాగతం పలుకగా, అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ఆలయ ప్రదక్షిణ చేసి.. వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. స్వామివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు. కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్..కామారెడ్డి లో ఈ నెల 9న నామినేషన్ దాఖలుకు ముహూర్తంగా నిర్ణయించారు.
1985 నుంచి ఇదే సంప్రదాయం: సీఎం కేసీఆర్, హరీశ్‌రావు , ఇతర పార్టీ నేతలు ఎన్నికల సమయంలో వెంకన్నకు దర్శనం చేసుకొని స్వా మివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారి సీఎం కేసీఆర్ కేసీఆర్‌కు విజయం వరించింది.

1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల సమయంలో ఈ ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేసి, నామినేషన్ వేశారు. అన్ని సందర్భాల్లోనూ విజయం సాధించారు. 2001లో టీడీపీకి, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన కేసీఆర్.. ఆ తర్వాత ఈ ఆలయంలోనే పూజలు చేసి టీఆర్‌ఎస్ పార్టీని ప్రకటించారు. ఇప్పుడు దీనినే అనుసరించారు.
ఎన్నికల వ్యూహాల్లో బిజీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో రాజశ్యామల యాగం నిర్వహించారు. తన ఫాం హౌస్ లో నిర్వహించిన ఈ యాగంలో కేసీఆర్ పాల్గొన్నారు. 2018 ఎన్నికల సమయంలోనూ ఈ యాగం నిర్వహించిన కేసీఆర్ మరోసారి అధికారం దక్కించుకున్నారు. మరోసారి గెలవాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి తన సెంటిమెంట్లను కొనసాగిస్తూనే..రాజకీయ వ్యూహాల్లో నిమగ్నయ్యారు.

పార్టీ అభ్యర్దుల ప్రచార తీరు.నియోజకవర్గాల్లో ప్రత్యరి పార్టీల వ్యూహాలు..పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యల పైన ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ సారి రెండు నియోజకవర్గాల్లో కేసీఆర్ పోటీ చేస్తుండటం తో ఫలితం..మెజార్టీ పైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications