
సీఎం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష: ప్రజలనే బుట్టలో వేసే పనిలో కేసీఆర్ చేస్తుందిదే!!
తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచి రెడీ అవుతున్నారు. ఇప్పటి నుండే ఆపరేషన్ ఆకర్ష మొదలుపెట్టారు. అయితే కెసిఆర్ ఈసారి మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష రాజకీయ వర్గాలను టార్గెట్ గా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. కెసిఆర్ ఈసారి ప్రజలని ఆపరేషన్ ఆకర్ష అంటున్నారు. ఎప్పుడూ ఎన్నికలకు ముందు వివిధ పథకాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసే కెసిఆర్, ఈసారి ఇప్పటి నుంచే సరికొత్త పథకాలతో ప్రజలను టిఆర్ఎస్ పార్టీ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

త్వరలో కేసీఆర్ మరో కొత్త పథకం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారని ఈ మేరకు ఈ నెల 10వ తేదీన జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ 10వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రధానంగా సొంత స్థలం ఉన్న బలహీన వర్గాల వారికి గృహ నిర్మాణం కోసం కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ విషయంలో వేగం పెంచి త్వరగా లబ్దిదారులకు ఇళ్ళు ఇవ్వాలని ప్రయత్నం చేస్తూనే, మరోవైపు సొంత స్థలం ఉంటే గృహ నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయలు ప్రభుత్వ సాయం గా అందించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ వర్గాల ప్రజలను తమవైపుకు తిప్పుకునే ఎత్తుగడ
పదో
తేదీన
జరగనున్న
కేబినెట్
సమావేశంలో
ఈ
నిర్ణయానికి
ఆమోదముద్ర
వేయనున్నట్టు
కూడా
తెలుస్తుంది.
ఇప్పటికే
దళిత
బంధు,
గిరిజన
బంధు,
రైతు
బంధు
అంటూ
అనేక
పథకాల
విషయంలో
తెలంగాణ
ప్రజలకు
అండగా
ప్రభుత్వం
ఉంటుంది
అని
చెబుతున్న
కేసీఆర్
ప్రభుత్వం
ప్రజలను
తమ
వైపు
తిప్పుకునే
ప్రయత్నం
చేసింది.
ఇక
ఇప్పుడు
మరో
మారు
సొంత
స్థలం
ఉన్న
వారికి
మూడు
లక్షల
రూపాయలు
ఇల్లు
కట్టుకోవడానికి
ఇవ్వాలని
మరో
సరికొత్త
పథకంతో
ఎన్నికల
ముందు
నుంచే
సీఎం
కేసీఆర్
ప్రజలను
తమ
వైపు
తిప్పుకునే
ప్రయత్నం
చేయనున్నారు.

నిరుపేదల సొంతింటి కల నెరవేర్చటం కోసం సరికొత్త పథకం
స్థలం
ఉండి
ఇల్లు
కట్టుకోలేని
నిరుపేదల
సొంతింటి
కల
నెరవేర్చటం
కోసం
సీఎం
కేసీఆర్
అందించనున్న
ఈ
పథకానికి
ఆమోదముద్ర
పడితే
అన్ని
నియోజకవర్గాల్లో
అర్హులను
గుర్తించి
15
రోజులలో
నిధులను
విడుదల
చేసే
విధంగా
ప్లాన్
చేస్తున్నట్టుగా
సమాచారం.
ఇక
ఈ
పథకంతో
ప్రజలను
తమ
వైపుకు
తిప్పుకోవాలని
సీఎం
కేసీఆర్
ప్లాన్
గా
కనిపిస్తుంది.
ప్రతిపక్షాల
ఎత్తుగడలకు
భిన్నంగా
ఈ
సారి
కేసీఆర్
ప్రధానంగా
ప్రజలపైనే
ఫోకస్
పెట్టి
వారిని
ఆకట్టుకుంటున్నారు.

కేసీఆర్ ప్రజా ఆపరేషన్ ఆకర్ష వర్కవుట్ అవుతుందా?
ఏది
ఏమైనా
తెలంగాణ
రాష్ట్రంలో
మూడోసారి
కూడా
అధికారంలోకి
రావాలని
భావిస్తున్న
సీఎం
కేసీఆర్,
ఈసారి
ప్రజలపైనే
ప్రధానంగా
ఫోకస్
పెట్టారు.
ప్రజలను
తమ
వైపు
తిప్పుకోవడానికి
అన్ని
అస్త్రాలను
ప్రయోగిస్తున్నారు.
ప్రజలు
తనకు
అండగా
ఉంటే
దేశ
రాజకీయాలు
చేయడానికి
వెళతానని,
తెలంగాణ
ప్రజలంతా
ఆ
హామీ
ఇవ్వాలని
ఇప్పటినుంచే
విజ్ఞప్తి
చేస్తున్నారు.
కొత్త
కొత్త
పథకాలతో
సంచలన
నిర్ణయాలు
తీసుకుంటూ
ప్రజలను
ఆపరేషన్
ఆకర్ష
అంటున్నారు.
మరి
కేసిఆర్
చేస్తున్న
ఈ
వినూత్న
ప్రయోగం
ఏమేరకు
ఫలితాలను
ఇస్తుంది
అనేది
వేచి
చూడాల్సిందే.