సింగరేణికి సీఎం వరాలు: చంద్రబాబు రద్దు చేస్తే కేసీఆర్ పునరుద్ధరించారు
హైదరాబాద్: సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి గురువారం కీలక సమావేశం జరిపారు. ఈ సందర్భంగా సీఎం పలు నిర్ణయాలను తీసుకుంటూ సింగరేణి కార్మికులపై వరాల జల్లు కురిపించారు.
సింగరేణి లాభాల్లో కార్మికులకు 23 శాతం వాటా చెల్లించాలని గురువారం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి సంస్థకు 2015-16కు గాను రూ. 1066.13 కోట్ల నికర ఆదాయం సమకూరింది. దీంతో లాభాల్లో కార్మికులకు రూ. 245.21 కోట్లు పంపిణీ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో ఒక్కో కార్మికుడికి సగటున రూ. 43 వేలు అందనున్నాయి. దీంతోపాటు దీపావళి బోనస్‌గా ప్రతి కార్మికునికి మరో రూ. 54 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో ఒక్కో కార్మికుడికి రూ. 97 వేలకు పైగా నగదు అందనుంది.
దీంతో పాటు 1998లో చంద్రబాబు ప్రభుత్వం రద్దుచేసిన డిపెండెంట్ ఉద్యోగాల నియామకాలను తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పారు. అదే విధంగా డిపెండెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపడతామని స్పష్టం చేశారు. సింగరేణిలో పనిచేసి గాయపడినా, అనారోగ్యం పాలయినా, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం అన్నారు.
ఈ ఏడాది అత్యధిక లాభాలు గడించిన సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు సీఎం అభినందనలు తెలిపారు. సరిహద్దుల్లో సైనికులు, గని కార్మికులు ఇద్దరూ సమానమేనని అన్నారు. తెలంగాణ ప్రజలకు పాలన చేతకాదని విమర్శించిన వాళ్ల నోళ్లు మూయించేలా తెలంగాణ పాలన కొనసాగుతుందని కేసీఆర్ తెలిపారు.
కార్మికులకు రెండు బోనస్‌లు చెల్లించడం చారిత్రాత్మకమని సింగరేణి జేఏసీ ఛైర్మన్ ఎండీ మునీర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో సింగరేణి కార్మికులు ఆనందోత్సాహంలో సంబురాలు జరుపుకుంటున్నారు. కార్మికులకు బోనస్ చెల్లించేందుకు అంగీకరించిన సీఎం కేసీఆర్‌కు విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కృతజ్ఞతలు తెలిపారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications