బయటి నుంచే కేసీఆర్ దైవదర్శనం - యాదాద్రిలో సీఎం పర్యటన, పూజలు - ఆలయ నిర్మాణంపై రివ్యూ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం పర్యటించారు. ఐదేళ్లుగా సాగుతోన్న ఆలయ అభివృద్ధి పనులు దాదాపు పూర్తికావొస్తుండగా, వాటిని పరిశీలించేందుకు ఆయన ఆదివారం యాదాద్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే పనులపై అధికారులతో రివ్యూ నిర్వహించారు.

యాదాద్రికి వచ్చిన ముఖ్యమంత్రికి అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలోని లక్ష్మీనారసింహస్వామికి సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అయితే, కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ, ఆలయ ద్వారం బయటి నుంచే కేసీఆర్ దైవదర్శనం చేసుకోవడం గమనార్హం.

CM KCR performs special pooja at Yadadri temple, reviews construction work

స్వామివారి దర్శనం తరువాత సీఎం.. అక్కడి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన పనులకు సంబంధించిన సమాచారాన్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి ఆలయం ఈవో గీతారెడ్డ, ప్రధాన శిల్పి ఆనంద్ సాయి సహా ఇతర అధికారులు సీఎంకు అన్నీ వివరించారు. ఆలయం చుట్టూ నిర్మిస్తోన్న 6లైన్ రింగ్ రోడ్డు, ఘాట్ రోడ్డులో మొక్కల పెంపకం, ఇటీవల మహాబలిపురం నుంచి తెప్పించిన విగ్రహాలు, ప్రసాదం కాంప్లెక్స్, పుష్కరిణి వద్ద సాగుతోన్న పనుల తీరును అధికారులు సీఎంకు తెలిపారు.

CM KCR performs special pooja at Yadadri temple, reviews construction work

యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి ఆలయం లోపల, వెలుపల జరుగుతోన్న నిర్మాణ పనులకు సంబంధించి సీఎం కేసీఆర్ అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో యాదాద్రిలో పోలీసులు ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టారు. కేసీఆర్ వెంట మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి తదితరులు కూడా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+