ఆ నలుగురు ఎమ్మెల్యేలను మెచ్చుకున్న సీఎం కేసీఆర్; అత్యవసర భేటీ.. అర్ధరాత్రి దాకా కీలకచర్చలు!!

టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బిజెపి ప్రయత్నాలు చేసిందన్న ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఎమ్మెల్యేలతో ముగ్గురు వ్యక్తులు బేరసారాలకు దిగారు అంటూ ఒక వీడియో బయటకు రావడం, దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్ట్ చేయడం జరిగింది.

 కొనుగోలుకు యత్నం ఎపిసోడ్ తర్వాత నేరుగా సీఎం కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యేలు

కొనుగోలుకు యత్నం ఎపిసోడ్ తర్వాత నేరుగా సీఎం కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యేలు

ఇదిలా ఉంటే బేరసారాలకు పాల్పడిన ఆరోపణలతో ముగ్గురు స్వామీజీలను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతి భవన్ కు చేరుకున్నారు. అక్కడ సీఎం కేసీఆర్ వారితో ఈ ఆపరేషన్ కి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. నలుగురు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ఫాం హౌస్ లో జరిగిన వ్యవహారం పై వారిని అడిగి తెలుసుకున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందన్న విషయాన్ని నలుగురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ కు వివరించారు.

కెసీఆర్ తో అత్యవసర భేటీ.. పలు కీలక విషయాలపై చర్చ

కెసీఆర్ తో అత్యవసర భేటీ.. పలు కీలక విషయాలపై చర్చ

తమతో బిజెపి నేతలు సంప్రదింపులు జరిపిన తీరు, ప్రలోభాలకు గురి చేసిన వైనాన్ని నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ కు పూసగుచ్చినట్లు వివరించారు అని సమాచారం. ఇక అంతే కాదు వారి వద్ద ఉన్న ఆడియో రికార్డింగ్ లకు సంబంధించిన సమాచారాన్ని కూడా సీఎం కేసీఆర్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. నలుగురు ఎమ్మెల్యేలతో కెసిఆర్ నిర్వహించిన ఈ అత్యవసర భేటీ లో తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా పాల్గొన్నారు.

 ఎమ్మెల్యేలను కొనియాడిన సీఎం కేసీఆర్ .. అలెర్ట్ గా ఉండాలని ఆదేశం

ఎమ్మెల్యేలను కొనియాడిన సీఎం కేసీఆర్ .. అలెర్ట్ గా ఉండాలని ఆదేశం


సీఎం కేసీఆర్ బిజెపి కుట్రలను బట్టబయలు చేసి ప్రలోభాలకు లొంగకుండా నిలబడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అభినందించారు. బిజెపి అసలు బుద్ధిని ప్రజలకు చూపించారని సీఎం కేసీఆర్ వారిని ప్రశంసించారు. ఇక ఇదే సమయంలో ఈ వ్యవహారంలో పోలీసుల విచారణ గురించి అడిగి తెలుసుకున్న సీఎం కేసీఆర్, తెలంగాణ పై ఫోకస్ పెట్టిన బిజెపి కుటిల యత్నాల నేపథ్యంలో అందరూ అలెర్ట్ గా ఉండాలని సూచించారు. తాజా రాజకీయ పరిణామాలతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని టిఆర్ఎస్ పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ సూచించారు

ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్.. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు

ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్.. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ శివారు మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బిజెపి భారీ ఆపరేషన్ ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఫిరాయింపుల కోసం నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరం జరుపుతుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పదిహేను కోట్ల రూపాయల మేరకు నగదు దొరికినట్లు సమాచారం. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల లో పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు. మొత్తం ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసినట్లుగా టిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ పార్టీ బిజెపి కుట్రలను వ్యతిరేకిస్తూ నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+