హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అదే మనకు శ్రీరామరాక్ష: కరోనాపై సీఎం కేసీఆర్ కీలక సూచనలు, జాగ్రత్తలు, హెచ్చరికలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనావైరస్ రాకుండా ముందు జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కరోనాపై మంత్రులు, అధికారులతో గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.

Karimnagar హైఅలర్ట్: 8 మందికి కరోనా పాజిటివ్, 100 వైద్య బృందాలు, హెచ్చరికలుKarimnagar హైఅలర్ట్: 8 మందికి కరోనా పాజిటివ్, 100 వైద్య బృందాలు, హెచ్చరికలు

అంతా బాగున్నారు..

అంతా బాగున్నారు..

హైదరాబాద్‌లో ప్రస్తుతం 1160 మంది క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చినవారితో సహా అందరి ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ చనిపోయే పరిస్థితి లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా వైరస్ సోకిందని.. తెలంగాణలోని ఎవరూ కూడా కరోనాబారిన పడలేదని చెప్పారు.

విదేశాల నుంచి వస్తే రిపోర్టు చేయండి..

విదేశాల నుంచి వస్తే రిపోర్టు చేయండి..

విదేశాల నుంచి తెలంగాణలోకి వచ్చిన వారు స్వచ్ఛందంగా వారి వివరాలను ప్రభుత్వ అధికారులకు అందజేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. పక్క రాష్ట్రాల్లో దిగి రోడ్డు, రైలు మార్గాల్లో మన రాష్ట్రానికి వస్తున్నారని అన్నారు. మార్చి 1 తర్వాత విదేశాల నుంచి వచ్చినవారంతా ప్రభుత్వ అధికారుల వద్ద రిపోర్టు చేయాలని సూచించారు. నిర్లక్ష్యంతోనే విదేశాల్లో కరోనా వ్యాప్తి చెందుతోందని అన్నారు.

31 వరకు అన్నీ బంద్.. సహకరించాలి..

31 వరకు అన్నీ బంద్.. సహకరించాలి..

మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ స్వీయ నియంత్రణ చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. మార్చి 31 వరకు సినిమా హాళ్లు, క్లబ్బులు, స్విమ్మింగ్ ఫూల్స్, సెమినార్లు, ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. మార్చి 31 వరకు విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించామన్నారు. నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని తేల్చి చెప్పారు. అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు మూసివేయాలని కోరుతున్నామని కేసీఆర్ తెలిపారు. మంది గుమిగూడకుండా ఉంటే మనకు మనం రక్షణ కల్పించుకున్నట్లేనని అన్నారు. అన్ని మతాల వేడులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఉగాది, శ్రీరామనవమి వేడుకలను ప్రజలు తమ తమ ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలని కోరారు. పంచాంగ శ్రావణం టీవీల్లో లైవ్ ప్రసారాల్లో చూడాలని సూచించారు. ప్రజా రవాణా చేసే బస్సులు, రైళ్లు, ఆటోలు, టాక్సీలు శానిటేషన్ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో శానిటేషన్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్లు, పోలీసులు విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించి వైద్యశాలలకు తరలించాలి లేదా హోం క్వారంటైన్లో ఉంచాలని ఆదేశించారు. క్వారంటైన్లలో ఉన్నవారు కోరితే ఇళ్లలోనే క్వారంటైన్ ఉండేందుకు పంపిస్తామని, వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.

పక్క రాష్ట్రాల నుంచి కూడా.. 18 చెక్ పోస్టులు

పక్క రాష్ట్రాల నుంచి కూడా.. 18 చెక్ పోస్టులు

మొదట 11 దేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించామని, ఇప్పుడు 165 దేశాల నుంచి వచ్చినవారికి కూడా పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారిని వెంటనే క్వారంటైన్ చేయాలన్నారు. వ్యాధి లక్షణాలుంటే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. రైళ్లలోనూ శానిటేషన్ పెంచాలని ప్రధాని నరేంద్ర మోడీని రేపటి వీడియో కాన్ఫరెన్స్ లో కోరతామని కేసీఆర్ చెప్పారు.

సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే వారిని కూడా నియంత్రించాల్సి ఉందన్నారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చినవారు కూడా రామగుండంకు రైలులో వచ్చి ఆ తర్వాత కరీంనగర్‌కు వచ్చారని సీఎం తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చివారిపై నిఘా ఉంచేందుకు 18 చెక్ పోస్టులు ప్రారంభిస్తున్నామని తెలిపారు.

ఇండోనేషియా నుంచి ఎందుకొచ్చారో..

ఇండోనేషియా నుంచి ఎందుకొచ్చారో..

ఇండోనేషియా నుంచి వచ్చినవారు ఎందుకొచ్చారో తెలియదని, వారి పాస్ పోర్టులను పరిశీలించినట్లు తెలిపారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయని, వాటిని కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో ప్రతిరోజు శానిటేషన్ చేయాలని ఆదేశించామని తెలిపారు. ఇంటర్ పరీక్షలు విజయవంతంగా ముగిశాయన్నారు. అన్ని మతాల పెద్దలు ప్రజల క్షేమం కోసం ఎక్కువ సంఖ్యలో గుమిగూడకుండా చూడాలని కోరారు.

అదే మనకు శ్రీరామరక్ష

అదే మనకు శ్రీరామరక్ష

నిత్యావసర కొరతను సృష్టించే అవకాశం ఉన్నందున తాము కిరాణాలు, మాల్స్ మూసివేయడం లేదని చెప్పారు. జనం ఎక్కువగా గుమిగూడకుండా ఆయా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలంతా కనీస జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కళ్యాణమండపాలు, షాదీఖానాలు మూసివేస్తున్నామని తెలిపారు. 31 వరకు మాత్రమే పెళ్లిళ్లకు అనుమతి ఉందని, ఈలోగా పెళ్లిళ్లు చేసుకునేవారు 200 మందికి మించకుండా చూసుకోవాలన్నారు. ముందుజాగ్రత్త చర్యలే ప్రజలకు శ్రీరామరక్ష అని సీఎం కేసీఆర్ అన్నారు. వ్యక్తిగత నియంత్రణ అవసరమన్నారు. మీడియా కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలన్నారు. తైవాన్ కూడా ప్రజల అప్రమత్తతోనే కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొందని తెలిపారు. అంతర్జాతీయ విమానాలు రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరతానన్నారు. కాగా, మార్చి 22 నుంచి 29 వరకు అంతర్జాతీయ విమానాలను కేంద్రం రద్దు చేసింది.

అయితే, తాను రేపట్నుంచి రద్దు చేయాలని కోరతానన్నారు కేసీఆర్. రెగ్యులర్ విమానాలన్నీ రద్దు చేసి, ప్రత్యేక విమానాల్లో ఇతరదేశాల్లోని మనవారిని తీసుకురావాలని కేసీఆర్ అన్నారు. సీసీఎంబీని ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పించాలని ప్రధానిని కోరతామన్నారు.

English summary
langana CM KCR press meet over Coronavirus precautions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X