వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అశ్రద్ధ వద్దు.. స్వీయ నియంత్రణ పాటించండి.. కరోనాపై సీఎం కేసీఆర్ కీలక సమీక్ష

|
Google Oneindia TeluguNews

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. భారత్‌లో శనివారం ఒక్కరోజే 1.60లక్షల కేసులు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని వైద్య నిపుణలు అంచనా వేస్తున్నారు. తెలంగాణలోనూ కరోనా బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో కీలక స‌మావేశం నిర్వహించారు. ప్రజలు కరోనా పట్ల అశ్రద్ధ వహించవద్దని కోరారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్ర పాటించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

భ‌యం వ‌ద్దు.. అశ్ర‌ద్ధ చేయ‌వ‌ద్దు

భ‌యం వ‌ద్దు.. అశ్ర‌ద్ధ చేయ‌వ‌ద్దు

తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కరోనా వ్యాప్తిపై సీఎం కేసీఆర్.. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావుతో పాటు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిచారు . వైరస్ వ్యాప్తిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క‌రోనా వైర‌స్, ఓమిక్రాన్ వేరియంట్ ప‌ట్ల ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండాల‌ని ఈసందర్భంగా కేసీఆర్ సూచించారు. భయాందోళకు గురికాల్సిన అవసంర లేదని అయితే అశ్రద్ద మాత్రం చేయవద్దని కోరారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞ‌ప్తి చేశారు.

థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం

థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం


థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టడికి ప్రభుత్వ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆక్సిజన్, బెడ్స్ , మందులు వంటి ఎలాంటి కొరత లేదని వివరించారు. కరోనా వ్యాప్తిపై ఎప్పటికప్పుడు తనకు రిపోర్టు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు.

సొమ‌వారం నుంచి బూస్ట‌ర్ డోస్

సొమ‌వారం నుంచి బూస్ట‌ర్ డోస్


రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. తల్లిదండ్రులు అశ్రద్ధ చేయకుండా తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని కోరారు. రాష్ట్రం వ్యాప్తంగా ఇప్పటికే 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ కొనసాగుతుందని చెప్పారు. సోమవారం నుంచి 60 ఏళ్లు పైబడిన వయో వృద్ధులకు, హెల్త్ కేర్ వర్కర్స్ కు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్ ప్రారంభించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. రాబేయే సంక్రాంతి నేపథ్యంలో జనం గుంపులు గుంపులుగా కాకుండా ఎవరి ఇళ్లలోనే వారు జాగ్రత్తులు తీసుకుంటూ పండుగను జరుపుకోవాలని సూచించారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయోద్దన్నారు. దగ్గరలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి వెళ్లీ చికిత్స చేయించుకోవాలని కోరారు.

తెలంగాణలో కొత్త‌గా 1673 కేసులు

తెలంగాణలో కొత్త‌గా 1673 కేసులు


గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 1673 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 48,583 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యాధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,522 యాక్టివ్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. కరోనాతో బాధపడుతూ ఒకరు మృతి చెందారు. నిన్న ( శనివారం ) రాష్ట్రంలో 2,606 క‌రోనా కేసులు వెలుగు చూశాయి. నిన్న‌టితో పోలిస్తే ఈ రోజు 933 కేసులు త‌గ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి 330 మంది కోలుకున్నారని అధికారులు వెల్లడించారు.

English summary
1673 new corona cases in telangana, CM KCR Review on situation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X