Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ ఆవేదన: బస్తీల బాగు కోసం ఏం చేయాలి (ఫోటోలు)

హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్ వల్లే గల్లీ సమస్యలను గుర్తించగలిగామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం నగరంలోని పార్శిగుట్టలోని మధురానగర్‌లో ఉన్న రాఘవ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు గాను నగరవాసులంతా కృషి చేయాలని కోరారు. నగరంలో ఇకపై నిర్మాణాలన్నీ క్రమ పద్దతి ప్రకారమే జరగాలని సూచించారు. హైదరాబాద్‌లో 379 కిలోమీటర్ల మేర నాలాల ఉన్నాయని తెలిపారు.

నాలాలపై పేదలు ఇండ్లు కట్టుకుని అపరిశుభ్ర వాతావరణంలో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి కోసం ప్రభుత్వమే పక్కా ఇళ్లు కట్టిస్తుందని ప్రకటించారు. ఇందు కోసం చిలకలగూడలో ఉన్న రైల్వే భూముల్లో పది ఎకరాలు తీసుకోవాలని నిర్ణయించామని, రైల్వే శాఖతో చర్చిస్తామని అన్నారు.

ప్రతి నెలా తాను ఇక్కడికి వస్తానని చెప్పారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం తర్వాత నగరంలోని బస్తీల బాగు కోసం ఏం చేయాలి, ఏం చర్యలు చేపట్టాలి అనే వాటిపై ఒక అవగాహనకు వచ్చామని వెల్లడించారు. ప్రతి నెలా 17న స్వచ్ఛ హైదరాబాద్‌ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.

కేసీఆర్ ఆవేదన: బస్తీల బాగు కోసం ఏం చేయాలి

ఇటీవలే స్వచ్ఛ హైదరాబాద్ బృందాలను దేశంలోని ఢిల్లీ, నాగ్‌పూర్‌ నగరాలను పరిశీలించేందుకు పంపించానని పేర్కొన్నారు. నాగ్‌పూర్‌లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడంపై రాష్ట్ర బృందం అధ్యయనం చేసిందని తెలిపారు. నాగ్‌పూర్‌లో గతంలో వెయ్యి చెత్త కుండీలు ఉండేవని కానీ ఇవాళ ఆ సంఖ్య వందకు చేరిందని పేర్కొన్నారు.

ఈరోజు నాగపూర్ సుందర నగరంగా మారిందని అన్నారు. మనం కూడా మన నగరాన్ని చెత్త కుండీలు లేని నగరంగా మార్చుకోవచ్చని తెలిపారు. ఇందుకు మహిళలు నడుం బిగించాలని కోరారు. మహిళలు ఇందుకు పూనుకుంటే ఇది తప్పకుండా సాధ్యమవుతుందని అన్నారు.

ఇందు కోసం పదిహేను రోజుల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు రెండు చెత్త బుట్టాలు సరఫరా చేస్తారని, వాటిలో ఒక దానిలో తడి చెత్త మరొక దానిలో పొడి చెత్త వేసి మున్సిపల్ పారిశుద్య సిబ్బంది విజిల్ వేస్తూ వచ్చినపుడు వారి వాహనాల్లో వేయాలని కోరారు.

నెల రోజుల్లో సిటీ అంతటా సుమారు రెండువేల ఐదొందల మున్సిపల్ ఆటోలు చెత్త సేకరించేందుకు తిరుగుతాయని మహిళలంతా చెత్తను ఆ వాహనాల్లో వేయాలని సూచించారు. అయితే ఇన్నేళ్లు ఉన్న దరిద్రం ఒక్కసారిగా పోదని మనమంతా కృషి చేస్తే త్వరలోనే నగరం పరిశుభ్రంగా మారుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పద్మారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్‌తోపాటు ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. స్వచ్ఛ హైదరాబాద్ భాగంగా సీఎం కేసీఆర్ తోపాటు సహచర మంత్రులు కూడా హైదరాబాద్ నగరంలో పర్యటిస్తున్నారు.

 కేసీఆర్ ఆవేదన: బస్తీల బాగు కోసం ఏం చేయాలి

కేసీఆర్ ఆవేదన: బస్తీల బాగు కోసం ఏం చేయాలి

ఇటీవలే స్వచ్ఛ హైదరాబాద్ బృందాలను దేశంలోని ఢిల్లీ, నాగ్‌పూర్‌ నగరాలను పరిశీలించేందుకు పంపించానని పేర్కొన్నారు. నాగ్‌పూర్‌లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడంపై రాష్ట్ర బృందం అధ్యయనం చేసిందని తెలిపారు. నాగ్‌పూర్‌లో గతంలో వెయ్యి చెత్త కుండీలు ఉండేవని కానీ ఇవాళ ఆ సంఖ్య వందకు చేరిందని పేర్కొన్నారు.

కేసీఆర్ ఆవేదన: బస్తీల బాగు కోసం ఏం చేయాలి

కేసీఆర్ ఆవేదన: బస్తీల బాగు కోసం ఏం చేయాలి

ఈరోజు నాగపూర్ సుందర నగరంగా మారిందని అన్నారు. మనం కూడా మన నగరాన్ని చెత్త కుండీలు లేని నగరంగా మార్చుకోవచ్చని తెలిపారు. ఇందుకు మహిళలు నడుం బిగించాలని కోరారు. మహిళలు ఇందుకు పూనుకుంటే ఇది తప్పకుండా సాధ్యమవుతుందని అన్నారు.

కేసీఆర్ ఆవేదన: బస్తీల బాగు కోసం ఏం చేయాలి

కేసీఆర్ ఆవేదన: బస్తీల బాగు కోసం ఏం చేయాలి

ఇందు కోసం పదిహేను రోజుల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు రెండు చెత్త బుట్టాలు సరఫరా చేస్తారని, వాటిలో ఒక దానిలో తడి చెత్త మరొక దానిలో పొడి చెత్త వేసి మున్సిపల్ పారిశుద్య సిబ్బంది విజిల్ వేస్తూ వచ్చినపుడు వారి వాహనాల్లో వేయాలని కోరారు.

కేసీఆర్ ఆవేదన: బస్తీల బాగు కోసం ఏం చేయాలి

కేసీఆర్ ఆవేదన: బస్తీల బాగు కోసం ఏం చేయాలి

నెల రోజుల్లో సిటీ అంతటా సుమారు రెండువేల ఐదొందల మున్సిపల్ ఆటోలు చెత్త సేకరించేందుకు తిరుగుతాయని మహిళలంతా చెత్తను ఆ వాహనాల్లో వేయాలని సూచించారు. అయితే ఇన్నేళ్లు ఉన్న దరిద్రం ఒక్కసారిగా పోదని మనమంతా కృషి చేస్తే త్వరలోనే నగరం పరిశుభ్రంగా మారుతుందని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+