వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా చరిత్రలో కొత్త అధ్యాయం: 8కొత్త వైద్యకళాశాలల్లో తరగతులను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం కేసీఆర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఆన్ లైన్ లో కొత్త మెడికల్ కళాశాలలలో ఎంబీబీఎస్ తరగతులను ప్రారంభించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వైద్య రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్న కేసీఆర్ మెడికల్ సీట్ల కోసం తెలంగాణా విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్ళే పని లేకుండా మెడికల్ కాలేజీల ఏర్పాటుపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా కొత్తగా 8 మెడికల్ కాలేజీలను నిర్మించి వైద్య విద్యా బోధనకు శ్రీకారం చుట్టారు. ప్రగతి భవన్ లో వర్చువల్ గా సీఎం కేసీఆర్ మెడికల్ కళాశాలలో తరగతులను ప్రారంభించారు.

8 కొత్త వైద్యకళాశాలల్లో తరగతులను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం కేసీఆర్

రాష్ట్రంలోఎనిమిది కొత్తప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యాబోధన తరగతులను ప్రారంభించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల లోను కొత్త మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తామని అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వైద్య విద్య కోసం విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే సరిపడా సీట్లు ఉంటాయని స్పష్టం చేశారు.

తెలంగాణ చరిత్రలో ఇది కొత్త అధ్యాయం: సీఎం కేసీఆర్

తెలంగాణ చరిత్రలో ఇది కొత్త అధ్యాయం: సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేస్తున్నారు. కొత్త మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారు. తాజాగా సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, రామగుండంలోఈకళాశాలలు ఏర్పాటయ్యాయి. ఈ కళాశాలల్లో నేటి నుంచి తరగతులు ప్రారంభించిన కేసీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో ఇది కొత్త అధ్యాయం అని పేర్కొన్నారు. తెలంగాణ దేశానికి మార్గదర్శకం కాబోతుందని వెల్లడించారు.

 తెలంగాణాలో ఎంబీబీఎస్ సీట్లు నాలుగు రెట్లు పెరిగాయి

తెలంగాణాలో ఎంబీబీఎస్ సీట్లు నాలుగు రెట్లు పెరిగాయి

మారుమూల ప్రాంతాలలో కూడా మెడికల్ కళాశాలలు ఏర్పాటు అవుతాయని తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఊహించలేదని పేర్కొన్న కేసీఆర్ కొత్త మెడికల్ కళాశాలలను తీసుకురావడానికి మంత్రి హరీష్ రావు ఎంతో కృషి చేశారని కొనియాడారు. 8 కొత్త మెడికల్ కళాశాలను ప్రారంభించడం గర్వకారణమని స్పష్టం చేశారు. గతంలో 850 సీట్లు ఉండేవని, కానీ ఇప్పుడు 2790 సీట్లకు వైద్యవిద్య ఎంబీబీఎస్ సీట్లు పెంచుకోగలిగామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఎంబీబీఎస్ సీట్లు నాలుగు రెట్లు పెరిగాయి అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 33 మెడికల్, నర్సింగ్ కళాశాలలను నిర్మిస్తాం

రాష్ట్ర వ్యాప్తంగా 33 మెడికల్, నర్సింగ్ కళాశాలలను నిర్మిస్తాం

ఇక పీజీ సీట్లు కూడా 1,180 కి చేరి రెట్టింపయ్యాయి అని పేర్కొన్నారు. ఇక పీజీ సీట్లు కూడా 1,180 కి చేరి రెట్టింపయ్యాయి అని పేర్కొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 మెడికల్, నర్సింగ్ కళాశాలలను నిర్మిస్తామని పేర్కొన్న కెసిఆర్, రాష్ట్రంలో వైద్య రంగాన్ని పటిష్టం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

English summary
A new chapter has begun in the history of Telangana. CM KCR, who has started classes in 8 new medical colleges virtually, is giving a big boost to the medical field in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X