హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'వణికిపోయే పరిస్థితి రావాలి': తెలంగాణలో కొత్త జిల్లాలను ప్రారంభించేది వీరే

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నకిలీ విత్తన తయారీదారులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాల అంశంపై క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉన్నతాధికారులతో ఆయ‌న స‌మీక్ష నిర్వహించారు. వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో నకిలీ విత్తనాల సమస్య వెలుగుచూడడంపై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నకిలీ విత్తనాలు తయారు చేయాలంటే వణికిపోయే పరిస్థితి రావాలని అన్నారు. పేకాట, గుడుంబా తయారీ, గుట్కాను తరిమికొట్టడంలో విజయం సాధించామ‌ని, అదే తరహాలోనే రాష్ట్రం నుంచి నకిలీ విత్తన తయారీ దారులు పారిపోయేలా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Cm KCR

దీంతో పాటే నకిలీ విత్తన తయారీ దారుల ఆస్తులు స్వాధీనం చేసుకొనే అవ‌కాశాల‌ను కూడా చట్టపరంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. నకిలీ విత్తనాల విక్రయాలను నియంత్రించని అధికారులను సస్పెండ్‌ చేయాలని కూడా ఆయన ఆదేశించారు. పనిలో పనిగా పోలీస్ శాఖ పునర్‌వ్యవస్థీకరణపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తయిన తర్వాత అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి మరో సారి పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమీక్షలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితోపాటు సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

మరోవైపు తెలంగాణలో ఏర్పాటు కానున్న కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు దసరా రోజు నుంచే ప్రారంభం కానున్నాయి. ఏ జిల్లాను ఎవరు ప్రారంభిస్తారనే అంశాన్ని ఈ రోజు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. సీఎం కేసీఆర్ సిద్దిపేట, మెదక్ జిల్లాల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి హరీశ్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొంటారు.

ఏ జిల్లాను ఎవరు ప్రారంభిస్తారు:

జనగామ - మండలి ఛైర్మన్ స్వామిగౌడ్
భూపాలపల్లి- స్పీకర్ మధుసూదనాచారి
వరంగల్ రూరల్ - డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
జగిత్యాల - డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
యాదాద్రి - హోంమంత్రి నాయిని
పెద్దపల్లి - మంత్రి ఈటల రాజేందర్
కామారెడ్డి - మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి
మంచిర్యాల - మంత్రి పద్మారావు
వికారాబాద్ - మంత్రి మహేందర్‌రెడ్డి
సిరిసిల్ల- మంత్రి కేటీఆర్
ఆసిఫాబాద్- మంత్రి జోగు రామన్న
నిర్మల్ జిల్లా - మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
గద్వాల జిల్లా - మంత్రి తలసాని శ్రీనివాస్
నాగర్ కర్నూల్ - మంత్రి లక్ష్మారెడ్డి
సూర్యాపేట - మంత్రి జగదీష్‌రెడ్డి
కొత్త గూడెం - మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
మహబూబాబాద్ - మంత్రి చందూలాల్
వనపర్తి జిల్లా - మంత్రి జూపల్లి కృష్ణారావు
మల్కాజ్‌గిరి - సీఎస్ రాజీవ్‌శర్మ

English summary
Cm KCR and Telangana ministers to starts new districts on dussehra
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X