వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ జోరు: 10న మళ్లీ వాసాలమర్రికి సీఎం -50వేల ఉద్యోగాల తర్వాత తొలి టూర్ -13న కేబినెట్ భేటీ

|
Google Oneindia TeluguNews

విపక్షాలు విమర్శిస్తున్నట్లు హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక కారణంగానో, సాధారణ విధిగానో, తన పనితీరులో ముఖ్యమంత్రి కేసీఆర్ జోరు ప్రదర్శిస్తున్నారు. కరోనా రెండో దశ విలయం తగ్గుముఖంపట్టిన తర్వాత నుంచి వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తోన్న ఆయన 20 రోజుల వ్యవధిలో తన దత్తత గ్రామానికి రెండోసారి వెళుతున్నారు. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీకి శుక్రవారం ఆదేశాలు వెలువడిన తర్వాత సీఎం చేపట్టనున్న తొలి టూర్ ఇదే కావడం గమనార్హం.

గెలవని యుద్ధం: ఆగస్టు31తో సమాప్తం -అఫ్గానిస్థాన్ నిర్మాణం మా పనికాదు: అమెరికా జోబైడెన్ సంచలనంగెలవని యుద్ధం: ఆగస్టు31తో సమాప్తం -అఫ్గానిస్థాన్ నిర్మాణం మా పనికాదు: అమెరికా జోబైడెన్ సంచలనం

ఈ నెల 10న, అంటే శనివారం సీఎం కేసీఆర్ యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని వాసాల‌మ‌ర్రి గ్రామానికి వెళ్ల‌నున్నారు. రేపు వాసాల‌మ‌ర్రిలో నిర్వ‌హించ‌బోయే గ్రామ స‌భ‌లో ఆయన పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌ను అధికారులు పూర్తి చేశారు. వాసాల‌మ‌ర్రి గ్రామాభివృద్ధికి ప్ర‌భుత్వం తోడ్పాటును అందిస్తుంద‌ని ప్రకటించిన సీఎం జూన్ 22న అక్కడ భారీ సభను నిర్వహించి, గ్రామస్తులతో సహపంక్తి భోజనాలు చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామంలో జరిగిన మార్పులను పరిశీలించేందుకు మళ్లీ వస్తానన్న ఆయన.. చెప్పినట్లుగానే రేపు వాసాలమర్రికి వెళ్లనున్నారు. కాగా,

cm kcr to visit his adopted vasalamarri village on july 10, ts cabinet meet on july 13

సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో రాష్ర్ట వైద్యారోగ్య శాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, వైద్యారోగ్య శాఖ అధికారులు ఈ భేటీకి హాజ‌ర‌య్యారు. తెలంగాణలో క‌రోనా ప‌రిస్థితులు, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల బ‌లోపేతంతో పాటు ఇత‌ర అంశాల‌పై సీఎం అధికారుల‌తో చ‌ర్చించారు. ఇదిలా ఉంటే,

తెలంగాణ వ్యాప్తంగా జూన్ 1న చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఈనెల 10తో ముగియనున్నాయి. దీని ద్వారా చోటుచేసుకున్న మార్పులపై చర్చించడంతోపాటు రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులు, కరోనా స్థితిగతులను చర్చించేందుకు ఈ నెల 13న రాష్ర్ట కేబినెట్ భేటీ కానుంది. ప్రగతి భవన్ లో సీఎం అధ్యక్ష‌త‌న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

అలా ప్రమాణం, ఇలా మోదీపై తిట్లు -కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై హ్యాకర్ల పిడుగుఅలా ప్రమాణం, ఇలా మోదీపై తిట్లు -కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై హ్యాకర్ల పిడుగు

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి శుక్రవారం కీలక ప్రకటన వెలుడింది. కొత్త జోనల్ విధానానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోదం లభించిన దరిమిలా అన్నిశాఖల్లో కలిపి దాదాపు 50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలని సీఎం కేసీఆర్ అధికారుల్ని ఆదేశించారు. తొలి దశలో ఉద్యోగాల భర్తీ, రెండో దశలో ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఖాళీల భర్తీ ఉండనుంది.

English summary
Telangana Chief Minister KCR will visit his adopted village vasalamarri in Yadadri bhuvanagiri district on saturday. CM, who recently visited Datta village Vasalamarri, will participate in the grama sabha tomorrow. otherside, the state cabinet meeting chaired by Chief Minister KCR will be held on the 13th of july at Pragati Bhavan. Corona conditions in Telangana, agriculture, villages, rural development and other issues will be discussed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X