సీఎం రేవంత్ ఆప్తుడికి ఎమ్మెల్సీ ఖరారు - లిస్టులో..!!

తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్ధుల పై దాదాపు స్పష్టత వస్తోంది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అయిదు స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క స్థానం దక్కనుంది. కాంగ్రెస్ మిత్రపక్షంగా సీపీఐ కు ఒక సీటు కేటాయించనున్నారు. మిగిలిన మూడు స్థానాల్లో రేవంత్ సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక పైన హైకమాండ్ తో చర్చలు చేస్తున్నారు. అందులో భాగంగా రేవంత్ ఆప్తుడు కుసుమ కుమార్ కు సీటు ఖాయమైనట్లు సమాచారం. అదే విధంగా మరో రెండు స్థానాల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

రేవంత్ మంత్రాంగం
ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక కోసం సామాజిక సమీకరణాల ఆధారంగా చర్చలు జరుగుతున్నాయి. 10వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది. దీంతో, ఈ రోజే అభ్యర్ధులను కాంగ్రెస్ అధికా రికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో అద్దంకి దయాకర్ మాల సామాజిక వర్గ నేతకు మొదటి ప్రాధాన్యత దక్కుతుందని భావిస్తున్నారు. రేవంత్ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. అయితే, సామాజిక సమీకరణాల ఆధారంగా ఇప్పుడు అవకాశం దక్కకుంటే రాజ్యసభకు పంపే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఎంబీసీల నుంచి మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌, చరణ్‌ కౌశిక్‌ రేసులో ఉన్నారు.

cm-revanth-close-aide-kusumakumar-to-be-sent-to-council-here-is-the-complete-list

కుసుమ కుమార్ కు ఛాన్స్
పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని పార్టీ నూతన ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ మిత్రుడు కుసుమ కుమార్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టితో పాటుగా మంత్రి ఉత్తమ్ సైతం కుసుమ కుమార్ కు మద్దతు ఇస్తున్నారు. గత 30 ఏళ్ల కాలంగా కాంగ్రెస్ లో ఉన్న నేత కావటంతో.. ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకా శం ఇవ్వాలనే ప్రతిపాదనకు దాదాపు ఆమోద ముద్ర పడినట్లు తెలుస్తోంది. ఇక త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతాయన్న ప్రచారం ఉండటంతో హైదరాబాదులో దాదాపుగా 5 లక్షల మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటంతో కుసుమకుమార్ ఎంపిక కలిసొస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కొన్ని నెలల క్రితం కమ్మ గ్లోబల్ ఫోరం (KGF) సమావేశాన్ని ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డిని కూడా కుసుమకుమార్ ఆహ్వానించారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వివాదం నడుస్తున్న నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి సీటు కేటాయించాలన్న అభిప్రాయాన్ని మరి కొందరు పార్టీ ముఖ్యులు తెరపైకి తెచ్చారు.

తుది జాబితాలో
మాదిగ సామాజిక వర్గం నుంచి ప్రధానంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ రేసులో తొలి వరుస లో ఉన్నారు. మైనార్టీ కోటాలో మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ఖాయం చేసే అవకాశం కనిపిస్తోంది.పోటీలో ఫిరోజ్ ఖాన్, ఖమ్మం నేత జావెద్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సీనియర్ నేత జగ్గారెడ్డి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. తాను పదవి కోసం రాలేదని జగ్గారెడ్డి చెబు తున్నారు. అటు విజయశాంతి పార్టీ చీఫ్ ఖర్గేతో సమావేశం అయ్యారు. ఈ రాత్రికి ఢిల్లీ నుంచి రానున్న ముఖ్యమంత్రి రేవంత్ తిరిగి రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. నామినేషన్ల గడువు ముగుస్తుండంతో ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్ధుల పైన నిర్ణయం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, ఆశావాహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+