లోకేష్.. కేటీఆర్ భేటీ వెనుక - విలన్ల అరెస్ట్ ఖాయం, రేవంత్ సంచలనం..!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్రంతో కలిసి పని చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో రెండు మినహా మిగిలినవి కొనసాగుతాయని స్పష్టం చేసారు. నీటి సమస్యల పై చంద్రబాబుతో జరిగిన చర్చల పైన స్పందించారు. బీఆర్ఎస్ నేతల కేసుల విచారణ పైన ఆసక్తి కర విశ్లేషణ చేసిన రేవంత్.. కేటీఆర్, లోకేష్ రహస్య సమావేశం ఏంటని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సభకు రావాలని రేవంత్ ఆహ్వానించారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబుతో జలశక్తి ఆధ్వర్యంలో నీటి సమస్యల పైన సీఎం రేవంత్ చర్చలు చేసారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసారు. రాష్ట్రంలో తాజా పరిణా మాల పైన స్పందించారు. బీసీ రిజర్వేషన్ల పైన తమ వ్యూహం తమకు ఉందని చెప్పారు. కేటీఆర్ డ్రగ్స్ కేసుతో పాటుగా.. బీఆర్ఎస్ అవినీతి వ్యవహారాల పైన విచారణ జరుగుతోందని వివరిం చారు. ప్రజలు తమకు అధికారం ఇచ్చింది సమస్యల పరిష్కారం కోసం అని చెప్పిన రేవంత్.. ఢిల్లీకి వెళ్లకుండా ఫాం హౌస్ కు వెళ్తే పరిష్కారం అవుతాయా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభలో చర్చకు వస్తే తాన చర్చించటానికి సిద్దమని రేవంత్ స్పష్టం చేసారు.

CM Revanth made interesting comments over Lokesh - KTR meeting

కేటీఆర్ నాయకత్వాన్ని చెల్లెలే అంగీకరించటం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. గతంలో సవాల్ విసిరితే పారిపోయారని ఎద్దేవా చేసారు. గత ప్రభుత్వ అవినీతి పైన విచారణ సాగుతోందని చెప్పిన రేవంత్.. విలన్లు క్లైమాక్స్ లో అరెస్ట్ అవుతారంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఉన్న కేసుల పై హడావుడి చేయటం లేదన్నారు.

బీజేపీ సీబీఐ పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తోందని రేవంత్ ఆరోపించారు. కిషన్ రెడ్డి బీసీ రిజర్వేషన్ పైన సవాల్ చేసారు. అదే సమయంలో కేటీఆర్, లోకేష్ ల మీటింగ్ సంగతి ఏంటని రేవంత్ ప్రశ్నించారు. రెండేళ్ల తరువాత కార్పోరేషన్ నామినేటె డ్ పోస్టులు మళ్లీ భర్తీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర సమస్యలపై ఢిల్లీ ప్రతీ నెలా రెండు సార్లు వచ్చి కేంద్ర మంత్రులను సమన్వయం చేసుకుంటానని రేవంత్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+