రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారైంది. ఆగస్టు 3న రాత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా బయల్దేరనుంది. ఈ పర్యటనలో భాగంగా పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలను సీఎం రేవంత్ బృందం కలవనుంది. వారితో చర్చించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురానున్నారు.

డల్లాస్ తోపాటు ఇతర రాష్ట్రాల్లో రేవంత్ బృందం పర్యటన కొనసాగనుంది.
ఆగస్టు 11న రేవంత్ రెడ్డి అమెరికా నుంచి తిరిగి రానున్నారు. తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది.

Telangana CM Revanth Reddy America tour confirmed

ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ క్యాంపస్‌ ప్రక్రియ వేగవంతం

అధునాతన వసతులతో విద్యను అందించడంతోపాటు విద్యార్థుల్లో సమానత్వ భావన పెరిగేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలను ఒకేచోట "ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ క్యాంపస్‌" పేరుతో ఏర్పాటుచేసే ప్రక్రియ వేగవంతమైంది. పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఈ క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం ఆర్కిటెక్ట్స్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సహా అధికారులతో సమీక్ష జరిపారు. ఇంటిగ్రేటేడ్ క్యాంపస్‌ల మాస్టర్ ప్లాన్, ఇతర అంశాలపై చర్చించారు.

ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ ను మినీ ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+