గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి..!!
Revanth Reddy: తెలంగాణలోని మైనారిటీ వర్గాల అభివృద్ధి, విద్య, ఉపాధి రంగాల్లో అవసరమైన మేరకు ఆదుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ముస్లింలలో ఎంతో మంది నిరుపేదలు ఉన్నారని, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాల్లో వారి జనాభా మేరకు అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
హజ్ యాత్రికుల సౌకర్యార్థం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని మామిడిపల్లిలో వసతి భవనం నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిందని రేవంత్ రెడ్డి చెప్పారు. ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా హజ్‌కు వెళ్లి ప్రార్థనలు చేయాలని అనుకుంటారని, ఈ సారి ప్రభుత్వానికి 6,000 దరఖాస్తులు అందితే వాటన్నింటినీ ఆమోదించినట్టు తెలిపారు.

హజ్ యాత్రికులకు వీడ్కోలు పలుకుతూ విమానాశ్రయం బయలుదేరిన బస్సులకు నాంపల్లి హజ్ హౌజ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. హజ్ యాత్రికులకు అభినందనలు తెలియజేశారు.
తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి హజ్‌కు వెళ్లే హజీల కోసం అవసరమైన ఏర్పాట్లు చేశారని, ప్రభుత్వం అందుకు అన్ని విధాలుగా సహకరించిందని రేవంత్ రెడ్డి చెప్పారు. హజ్‌కు వెళ్లడం ముస్లింల హక్కు అని, ఈ విషయంలో ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని పేర్కొన్నారు.
హజ్ యాత్రకు బయలుదేరి వెళ్లే వాళ్ల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ఆ బాధ్యతను నెరవేర్చడంలో వెనుకడుగు వేయబోమని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇదే వేదిక నుంచి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన అంశాలను రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఇది ఓల్డ్ సిటీ కాదని, ఇదే ఒరిజినల్ సిటీ అని ఇదివరకు ప్రకటించిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఒరిజినల్ సిటీ అభివృద్ధి కోసం అసదుద్దీన్ ఒవైసీ అడిగిన నిధుల కంటే ఎక్కువగానే ఇచ్చామని చెప్పారు. దాదాపు 2,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు.
మెట్రో విస్తరణ, రోడ్ల నిర్మాణం, మిరాలం ట్యాంక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణం వంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి సంక్షేమ పథకాల్లో తగిన వాటా మేరకు ముస్లింల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
రాజీవ్ యువ వికాసం కింద అర్హులైన ముస్లిం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారాయన. హజ్‌కు వెళుతున్న యాత్రికులు ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ప్రజల శాంతియుత జీవనం కోసం అల్లాను ప్రార్థించాలని కోరారు. హజ్ యాత్రికుల కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండలు అందిస్తుందని పేర్కొన్నారు.
భవిష్యత్తులోనూ ముస్లిం సామాజిక వర్గం నుంచి ప్రభుత్వానికి అందే వివిధ రకాల అభ్యర్థనల విషయంలోనూ ప్రభుత్వం చేయగలిగినంత సహాయం చేస్తుందని, దాన్ని తమ బాధ్యతగా భావిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్, అంజన్ కుమార్ యాదవ్, ప్రజా ప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, హజ్ కమిటీ ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications