CM Revanth Reddy: కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!
సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ లో కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు. అలాగే కాళోజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అర్ట్ గ్యాలరీ సందర్శించారు. వరంగల్ పర్యటనకు ముందు రేవంత్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం డిజిటల్ పద్దతిలో వరంగల్లో వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంఖుస్థాపన చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ప్రజా పాలన -ప్రజా విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సభకు వచ్చిన వారితో కరచాలనం చేశారు. వేదికపై దీపం వెలిగించారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ఈ సభలో డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. ఈ సభకు భారీ ఎత్తున మహిళలు వచ్చారు. శాంతి కుమారి స్వాగత ఉపన్యాసం చేశారు. ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్లు వివరించారు.
''తెలంగాణ చైతన్యపు రాజధాని.. కాళోజీ నుంచి పీవీ వరకు.. మహనీయులను తీర్చిదిద్దిన నేల.. స్వరాష్ట్ర సిద్ధాంతకర్త.. జయశంకర్ సార్‌కు జన్మనిచ్చిన గడ్డ.. హక్కుల కోసం వీరపోరాటం చేసిన సమ్మక్క - సారలమ్మలు నడయాడిన ప్రాంతం.. దోపిడీకి వ్యతిరేకంగా.. పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ యుద్ధ క్షేత్రం వరంగల్. వీరందరి స్ఫూర్తితో.. మనందరి భవిత కోసం వరంగల్ దశ-దిశ మార్చేందుకు నేడు వస్తున్నాను'' అని రేవంత్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. వేములవాడ పర్యటనకు రానున్నారు.












Click it and Unblock the Notifications