ఆమెతో తన అనుబంధంపై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్!
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి పర్వదినాన్నిఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. అక్కాచెల్లెళ్ళు తమ సోదరులకు రాఖీలు కడుతున్నారు.రాఖీ పండుగ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ పండుగ అన్నా, చెల్లెళ్ల ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తుందని రాష్ట్రపతి అన్నారు. ఈ పండుగ సమాజంలో సామరస్యాన్ని, ఐక్యతా స్ఫూర్తిని పెంపొందిస్తుందని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు.
రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్పిన రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహిళలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా భవన్ లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క రాఖీ కట్టారు. రక్షాబంధన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు.

సీఎం రేవంత్ కు రాఖీ కట్టిన సీతక్క
మంత్రుల క్వార్టర్స్ లో పొన్నంకు సీతక్క రాఖీ కట్టారు. పొన్నం ప్రభాకర్ పాదాభివందనం చేసి సీతక్క ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి సీతక్క నేడు సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన క్రమంలో ఆమె జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లి రేవంత్ దంపతులతో పాటు ఆయన మనవడికి బొట్టు పెట్టి రాఖీ కట్టారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు, రేవంత్ రెడ్డి మనవడికి కూడా సీతక్క రాఖీ కట్టారు.
సీతక్కతో అనుబంధంపై ఎమోషనల్ అయిన రేవంత్ రెడ్డి
ఈ క్రమంలో ఎమోషనల్ అయిన సీఎం రేవంత్ రెడ్డి సీతక్క ను గురించి ట్వీట్ చేశారు. సీతక్కతో తన అనుబంధాన్ని గురించి పేర్కొన్న రేవంత్ రెడ్డి అక్షరాలతో రచించలేనిది, మాటలతో నిర్వచించలేనిది సీతక్క తో తన అనుబంధం అంటూ పేర్కొన్నారు. ప్రతి రాఖీ పౌర్ణమి నాడు ఈ బంధం మరింతగా వికసిస్తూనే ఉంటుందని అయిన ట్వీట్ చేశారు. సీతక్క రాఖీ కట్టిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications