తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం లోగో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. సంఘానికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందజేస్తానని సీఎం ఈ సందర్భంగా తెలిపారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం గత ప్రభుత్వం విఫలం చెందిన నేపథ్యంలో ఉద్యమ జర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు, నూతన ఉత్తేజంతో యువ జర్నలిసులను కూడా కలుపుకొని పోయేందుకు కృషి చేస్తున్నట్లు టీయూజెఎస్ కన్వీనర్ ఎంఎం రహమాన్ తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ తమ విజ్ఞప్తికి స్పందించి లోగో ఆవిష్కరించారన్నారు. ఈ సంఘాన్ని అత్యున్నత ప్రాధాన్యతలో గుర్తించాలని, అక్కడికక్కడే సమాచార శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసినందుకు సీఎంకు రహమాన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, సీఎంవో చీఫ్ పీఆర్వో అయోధ్యరెడ్డిలకు, సంఘం నేతలు ధన్యావాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ సంఘం నేతలు మునీర్, కందుకూరి రమేష్‌బాబు, యాటకర్ల మల్లేష్, పసూనూరి రవీందర్, తాటికొండ రమేష్‌బాబు, సాధిక్, ఖాజీపేట నరేందర్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications