టాలీవుడ్ కు టార్గెట్ పెట్టిన రేవంత్..!!

Revanth Reddy: తెలంగాణలో గద్దర్ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా అల్లు అర్జున్.. గద్దర్ ఉత్తమ నటుడి అవార్డును స్వీకరించారు. పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్లు అవార్డులను అందుకున్నారు.

హైటెక్స్ వేదికగా, అంగరంగ వైభవంగా జరిగిన గద్దర్ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం వేడుకలను పురస్కరించుకుని గత 10 సంవత్సరాల సినిమాలకు అవార్డులు అందుకున్న నటీనటులు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్లకు రేవంత్ రెడ్డి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు.

CM Revanth Reddy made remarks on Telugu Film Industry

గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొలిపేది కళ అని అభివర్ణించారు. ఆ కళకు ప్రాణంపోసే సినీ పరిశ్రమను గుర్తించి, గౌరవించే సాంప్రదాయాన్ని తమ ప్రజా ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందని గుర్తు చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.

తెలంగాణ చైతన్యానికి ప్రతీక, తన గళంతో జనంలో, స్ఫూర్తిని నింపిన పతాక గద్దరన్న స్మృతిలో తమ ప్రజా ప్రభుత్వం తరపున తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డును ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని రేవంత్ చెప్పారు. తెలంగాణ రైజింగ్ - 2047లో ప్రణాళికలో సినీ పరిశ్రమకు ఒక చాప్టర్ ఉండాలన్నది తన ఆకాంక్షగా పేర్కొన్నారు.

తెలంగాణ 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలని, అందులో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు వాటా ఉండాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ స్థాయికి చిత్ర పరిశ్రమ ఎదగడానికి తమ ప్రజా ప్రభుత్వం తరఫున అవసరమైన సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

సినిమా రంగం అభివృద్ధి సాధించడానికి పరిశ్రమకు ఏం కావాలో చెప్పాలని, ఏ హోదాలో ఉన్నా కూడా ఇండస్ట్రీకి అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. అన్ని రకాల ప్రోత్సాహకాలను అందించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. తెలంగాణకు ఎవరైనా రావొచ్చు. ఎవరైనా వాణిజ్యం నిర్వహించవచ్చని పేర్కొన్నారు.

కొన్ని అంశాల్లో ప్రభుత్వ నిర్ణయాలు కఠినంగా కనిపిస్తాయని, సినిమా రంగాన్ని ఎప్పుడూ అభిమానంగా చూస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడే కాదు గతంలోనూ తమ ప్రభుత్వాలు సినిమా రంగాన్ని గౌరవించిందని, ఇంత అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వహకులకు, అందుకు సహకరించిన సినీ రంగ ప్రముఖులందరికీ అభినందనించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+