రేవంత్ కు రాహుల్ "డబుల్" గిఫ్ట్ - బిగ్ టాస్క్, వారితోనే సమస్య..!!
తెలంగాణలో రాజకీయం మారుతోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ పై హైకమాండ్ ఆశలు పెరుగుతున్నాయి. తమ లక్ష్యాలను చేరుకోవటంలో రేవంత్ పైనే భారం పెడుతున్నారు. అందులో భాగంగా రేవంత్ విషయంలో రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణలో తమ పట్టు జారకుండా ప్రయత్నాలు చేస్తోంది. దీంతో, తాజా నిర్ణయాలు రేవంత్ సమర్ధతకు పరీక్షగా మారుతున్నాయి.
పీసీసీ చీఫ్ గా రేవంత్ కొనసాగింపు: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ రేవంత్ గా హైకమాండ్ భావిస్తోంది. అధికారంలోకి వస్తూనే రేవంత్ కు సీఎం పగ్గాలు అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో లోక్ సభ ఎన్నికల్లోనూ ఇదే విధంగా ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికలు ప్రధానంగా మోదీ కేంద్రంగా జరగనున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మెజార్టీ బొటా బొటీ మెజార్టీ మాత్రమే ఉంది.

ఇదే సమయంలో ప్రస్తుతం సీఎం పదవితో పాటుగా పీసీసీ చీఫ్ గానూ రేవంత్ కొనసాగుతున్నారు. లోక్ సభ ఎన్నికల వరకు టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ ను కొనసాగిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ హైకమాండ్ కు కీలకం కావటంతో..ఇప్పటికిప్పుడు టీపీసీసీ బాధ్యతలు మరొకరికి అప్పగించేందుకు సిద్దంగా లేరని సమాచారం.
రేవంత్ పై రాహుల్ నమ్మకం: టీపీసీసీ చీఫ్ పదవి కోసం భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నిస్తున్నారు. సీఎం పదవి రేవంత్ కు అప్పగించటంతో తమకు పీసీసీ చీఫ్ ఇవ్వాలని హైకమాండ్ ను కోరుతున్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎంతో పాటుగా పీసీసీ చీఫ్ పదవిలో కొనసాగిస్తుండటంతో..తమకు అదే విధంగా ఇవ్వాలని భట్టి కోరుతున్నట్లు తెలుస్తోంది. సీఎంగా రేవంత్ కు సహకరిస్తున్న సమయంలో తమకు పీసీసీ పదవి ఇవ్వాలనేది సీనియర్ నేతల వాదన.
అయితే, సామాజిక సమీకరణాల్లో భాగంగా పీసీసీ చీఫ్ పదవి బీసీ వర్గానికి ఇవ్వాలనేది మరో డిమాండ్. దీంతో..మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ సైతం తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే రాహుల్ గాంధీ తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి పైన తాజాగా ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది.

రేవంత్ సమర్ధతకు పరీక్ష: కానీ, రేవంత్ వైపే రాహుల్ గాంధీ మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా పార్టీ ముఖ్య నేతలు చెబుతున్న సమాచారం మేరకు లోక్ సభ ఎన్నికల వరకు టీపీసీసీ చీఫ్ పదవి మార్పు ఉండదని తెలుస్తోంది. రేవంత్ ను కొనసాగించాలనేది రాహుల్ గాంధీ అభిమతంగా చెబుతున్నారు. అయితే, ఇక..లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి మెజార్టీ సీట్లు సాధించటం ఇప్పుడు రేవంత్ సమర్ధతకు పరీక్షగా మారుతోంది.
ముందుగా సీనియర్లు సహచర మంత్రులుగా కొనసాగుతున్నా..వారి సహకారం..మంత్రి పదవులు రానీ నేతల నుంచి వచ్చే సమస్యలు..పాలనా పరంగా ఉన్న సవాళ్లును అధిగమిస్తూ ఇప్పుడు సీఎంగా.. పీసీసీ చీఫ్ గా పార్టీని గెలిపించటం రేవంత్ కు ఛాలెంజ్ గానే కనిపిస్తోంది. రేవంత్ ను పీసీసీ చీఫ్ గానూ కొనసాగిస్తూ అధికారికంగా నిర్ణయం ప్రకటిస్తే..పార్టీలో చోటు చేసుకొనే పరిణామాలపైన ఆసక్తి కనిపిస్తోంది.
-
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications