స్కిల్ డెవలప్మెంట్‌పై రేవంత్ ఫోకస్ (వీడియో)

Revanth Reddy: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పెట్టుబడులపై దృష్టి సారించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకుంటోన్నారు. పారిశ్రామిక, ఐటీ విధానాలపై కసరత్తు సాగిస్తోన్నారు. త్వరలోనే దీన్ని ప్రకటించే అవకాశం ఉంది.

పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో ఆయన దావోస్‌ పర్యటనకు శ్రీకారం చుట్టారు. స్విట్జర్లాండ్‌లోని ఈ సిటీలో ప్రతి సంవత్సరం ఏర్పాటయ్యే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రేవంత్ రెడ్డి చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనలో ఆయన వెంట ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అధికారులు ఉన్నారు.

CM Revanth Reddy met with Nasscom President Debjani ghosh at Davos 2024

తన దావోస్ పర్యటనలో భాగంగా తొలి రోజు రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు బిజీగా గడిపారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (NASSCOM) చీఫ్ దేబ్‌జనీ ఘోష్‌, ఇతర ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లను ఏర్పాటు చేయడంపై వారితో చర్చించారు.

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్.. సహా వివిధ రంగాల్లో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా యువతకు నైపుణ్యాభివృద్ధిలో నాణ్యమైన శిక్షణ ఇప్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనికోసం తమ రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను నెలకొల్పాలని నాస్‌కామ్ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.

ఇంజినీరింగ్‌, నాన్ ఇంజినీరింగ్‌, డిగ్రీ కోర్సులను చదివే విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. వాటిని ఏర్పాటు చేయడానికి అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.

అంతకుముందు రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు.. దావోస్ ఆర్థిక సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించారు. వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాల గురించి వారికి వివరించారు. శ్రీధర్ బాబు, ఇతర అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+