ప్రపంచ దేశాలతో పోటీ పడేలా 6 కొత్త పాలసీలు: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామికాభివృద్ధికి కొత్త పాలసీలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(TSIIC)పై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్షించారు.
ఇంతకుముందు సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతిని సీఎం రేవంత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ రంగాలకు సంబంధించి ఆరు నూతన పాలసీలు తయారు చేస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఎంఎస్ఎంఈ, ఎగుమతులు, లైఫ్ సైన్సెస్, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ, ఈవీ పాలసీలకు సవరణ చేస్తున్నట్లు చెప్పారు.

టెక్స్‌టైల్స్ రంగానికి సంబంధించి పవర్ లూమ్, హ్యాండ్ లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త విధానాన్ని రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రపంచ దేశాల్లోని అత్యుత్తమ పాలసీలను అధ్యయనం చేయాలని సూచించారు. ప్రపంచంతో తెలంగాణ పోటీ పడేలా నూతన పారిశ్రామిక విధానాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్లిన సీఎం రేవంత్
తిరుమల శ్రీవారి దర్శనార్థం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబంతో కలిసి తిరుపతికి చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో శ్రీవారి తిరుమలకు వెళ్లారు. రచనా అతిథిగృహం వద్ద సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. కాగా, తన మనవడి పుట్టువెంట్రుకలు స్వామివారికి సమర్పించేందుకు రేవంత్ కుటుంబం తిరుమలకు విచ్చేసింది. బుధవారం ఉదయం శ్రీవారిని రేవంత్ కుటుంబసమేతంగా దర్శించుకోనున్నారు.












Click it and Unblock the Notifications