జంతర్ మంతర్ వేదికగా బీసీల కోసం గర్జించిన సీఎం రేవంత్.. పీఎం మోదీకి సవాల్!

రాష్ట్రంలో బీసీ లకు 42 శాతానికి రిజర్వేషన్ పెంచే బిల్లును వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఈరోజు కొత్త ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఒక రోజు ధర్నా చేపట్టారు. ఈ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరడానికి వారు అనుమతి కోరుతున్నారు.

మోదీపై ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్టీ ఎంపీలు, ఆ పార్టీ జాతీయ నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ధర్నాలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ, బిజెపి నేతలు బిసి రిజర్వేషన్ బిల్లులను అడ్డుకొని బలహీనవర్గాలకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

CM Revanth reddy roared for BC reservation bill at Jantar Mantar a challenge to Modi

గల్లీలో ఉండలేక ఢిల్లీలో తేల్చుకుందామని చలో ఢిల్లీ
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటే గుజరాత్ వారికి కడుపు మంట ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గల్లీలో ఉండలేక ఢిల్లీలో తేల్చుకుందామని చలో ఢిల్లీ చేపట్టామని ఆయన అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎలాగైనా సాధించి తీరుతామని చెప్పారు. ఢిల్లీలో ధర్నాకు వంద మంది ఎంపీలు, ఇండియా కూటమి పార్టీలు మద్దతు ఇచ్చాయని, ఇప్పటికైనా మోదీ బీసీ రిజర్వేషన్ల బిల్లు విషయంలో అడ్డుకోకుండా ఉంటే మంచిదని హితవు పలికారు.

మీకా అధికారం ఎవరిచ్చారు?
ఇక బీసీ రిజర్వేషన్ల కోసం నాలుగు కోట్ల మంది ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. డిమాండ్ ఆమోదిస్తారా మిమ్మల్ని గద్దె దించాలా అంటూ ప్రశ్నించారు. మా ఆలోచనలను మా బిల్లులను తుంగలో తొక్కే అధికారం మీకు ఎవరిచ్చారు అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బలహీనవర్గాలకు న్యాయం చేసే ఆలోచన మోదీకి లేదు
మోదీ మన బద్ద శత్రువు అని పేర్కొన్న రేవంత్ రెడ్డి బలహీనవర్గాలకు న్యాయం చేసే ఆలోచన ఆయనకు లేదన్నారు. ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావు సైతం బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడటం లేదని మండిపడ్డారు. తెలంగాణలో బలహీనవర్గాల ఓట్లు అడుగుతున్న వీరంతా ఏం చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు.

టిఆర్ఎస్ కు తెలంగాణలో పేగుబంధం కూడా తెగిందా?
ఇక పేరు బంధం తెగిన టిఆర్ఎస్ కు, తెలంగాణలో పేగుబంధం కూడా తెగిందా అంటూ ప్రశ్నించారు. ప్రజలతో మీ అవసరం తీరిపోయిందా అంటూ నిలదీశారు. బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం ఆపేది లేదని, కచ్చితంగా 42 శాతం రిజర్వేషన్ సాధించి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+