CM Revanth Reddy: సెక్యూరిటీ లేకుండా వస్తా.. రచ్చబండకు సిద్ధమా.. కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. అధికారం కోల్పోయిన వారు ప్రతీది అడ్డుకోవాలని చూస్తారని మండిపడ్డారు. వాళ్లంతా అధికారులు, మంత్రుల ముసుగులో దోచుకున్న బందిపోటు దొంగలని.. అలాంటి బందిపోటు దొంగలు మూసీ ప్రక్షాళన అడ్డుకోవాలని చూస్తున్నారని విరమర్శించారు. ఇది మూసీ సుందరీకరణ కాదని.. మూసీ ప్రక్షాళన అని రేవంత్ స్పష్టం చేశారు. మూసీలో ఉన్న మురికి కంటే వారి మెదళ్లల్లో ఉన్న విషయం ఎక్కవ అని ఎద్దేవా చేశారు. నది నగరం మధ్యలోంచి ప్రవహించే నగరం హైదరాబాద్ అని.. మూసీ పునర్ వైభవం తీసుకొస్తామని చెప్పారు.
మూసీ నది గర్భంలో 1600 ఇళ్లు ఉన్నాయి. అధికారులు ఆరు నెలలుగా సర్వే చేస్తున్నారు. నిర్వాసితులకు డబుల్ బెడ్ ఇళ్లు ఇస్తున్నాం. గత పాలకుల నిర్లక్ష్యంతోనే మూసీ మురికి కూపంలో తయారైందని అన్నారు. అద్దాల మేడాలు, అందాల భామల కోసం తాము పని చేయడం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ నీ నియోజకవర్గానికే వస్తా రచ్చబడ్డ నిర్వహిద్దామని చెప్పారు. కొండ పోచమ్మ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ ఎక్కడికైనా సెక్యూరిటీ లేకుండా వస్తానని సవాల్ విసిరారు. వేములఘాట్, మల్లన్న సాగర్ లో సర్వస్వం కోల్పోయిన వారికి ఇళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు.

పిల్లను ఇచ్చిన పాపానికి అత్తగారి ఇంటినే మిడ్ మనేరులో కలిపేసిన ఘనత కేసీఆర్ ది అని ఎద్దేవా చేశారు. హైడ్రా అనేది భూతం కాదని.. పేదవారి ఇళ్లను కూల్చడం లేదన్నారు. బఫర్ జోన్ లో 10 వేల ఇళ్ల ఉన్నాయి. వర్షం వస్తే బెంగళూరు, చెన్నై ఏమైందో చూశారుగా అని గుర్తు చేశారు. వాయనాడ్ లో ఏమైందో చూశాం. అందుకే భవిష్యత్ లో హైదరాబాద్ కు అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని భావిస్తున్నాం. మూసీ వల్ల హైదరాబాద్ వాసులే కాదు.. నల్గొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందలు పడుతున్నారు.
ఖమ్మం, విజయవాడలో ఏమైందో కళ్ల ముందే చూశాం. అలాంటి పరిస్థితి హైదరాబాద్ లో రాకూడదని చూస్తున్నాం.ఇదేదో తన స్వార్థం కోసం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. నల్గొండ ప్రజలు మౌనంగా ఉంటే ఎలా అని అన్నారు. యూట్యూబ్ ఛానళ్లతో అధికారం రాదన్నారు. యూట్యూబ్ చానళ్లు కొనుగోలు చేసి తనను తిట్టిస్తున్నారని.. ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications