రోజా ఇంట్లో పులుసు తిని.. : కేసీఆర్‌పై నిప్పులు, ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయాలన్న రేవంత్
కృష్ణా జలాలు తెలంగాణకు దక్కకుండా ఆంధ్రప్రదేశ్ తరలించేందుకు గత ప్రభుత్వమే సహకరించిందని బీఆర్ఎస్ పాలకులపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో 299 సరిపోతాయని సంతకం పెట్టింది కేసీఆర్ అని చెప్పారు. బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు పార్లమెంటులో అడిగితే.. కేంద్రమంత్రి ఇదే విషయాన్ని చెప్పారని సీఎం రేవంత్ తెలిపారు.
బీఆర్ఎస్ నేతలకు తెలంగాణ ప్రాజెక్టులపై చిత్తశుద్ధి ఉంటే నల్గొండలో కాదు.. ఢిల్లీలో ధర్నా చేయాలని.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు ఆమరణ దీక్ష చేయాలన్నారు రేవంత్. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. కాళేశ్వరం అవినీతి బయటపడటంతో కేఆర్ఎంబీకి అప్పగించారంటూ తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.

ఏపీ మంత్రి రోజా ఇంట్లో చేపల పులుసు తిని.. రాయలసీమను రతనాల సీమ చేస్తామని కేసీఆర్ చెప్పారన్నారు. ఇప్పుడు రాయలసీమ జిల్లాలకు నీళ్లు ఎట్లా పోతున్నాయో వారే సమాధానం చెప్పాలన్నారు. కేఆర్బీఎం గురించి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో బీసిన్లు, భేషజాలు లేవని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు.
తుపాకులతో ఏపీ పోలీసులు వచ్చి నీళ్లు పట్టుకుపోతుంటే.. చేతగాని సన్నాసుల్లా చూశారని గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్. కేసీఆర్ సహకారం లేకుండానే ఏపీ పోలీసులు వచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడుతుంటే. కాళ్లల్లో కట్టెలు పెడతారా? అని ధ్వజమెత్తారు. పదేళ్లు అవకాశం ఇచ్చినా ఎస్ఎల్బీసీని పూర్తి చేయకపోవడం బీఆర్ఎస్ చేతకానితనమేనని అన్నారు.
బీఆర్ఎస్ సర్కారు పాలమూరు, నల్గొండ జిల్లాలకు తీరని నష్టం చేసిందని రేవంత్ ధ్వజమెత్తారు. కృష్ణా నది నీళ్లను ఏపీకి కేటాయిస్తూ 2015లో కేసీఆర్ సంతకం పెట్టారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకుంటేనే ఏపీకి నీళ్లు వదిలారని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను సరైన విధంగా గౌరవిస్తున్నామన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సొంత ఊరును రెవెన్యూ విలేజ్‌గా తామే ప్రకటించామన్నారు.
తెలంగాణ గాయకుడు గూడ అంజన్న చివరి కోరిక.. కేసీఆర్‌ను చూడాలని చెప్పారని.. అయితే, ఆయనను కలిసేందుకు కేసీఆర్ వెళ్లలేదన్నారు. గద్దర వినతిపత్రం ఇద్దామనుకుంటే ప్రగతిభవన్‌లోనికి రానివ్వలేదన్నారు. తామ నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చామన్నారు. మీరు వద్దనుకున్న అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణను రాష్ట్ర గేయంగా ఆమోదించామన్నారు.
రైతు కొడుకు సీఎంగా సభలో ఉంటే జీర్ణించుకోలేకపోతున్నారా? అని కేసీఆర్‌ను పరోక్షంగా ప్రశ్నించారు. తనను ఈ స్థానంలో చూసేందుకు ఇష్టంలేదు కావొచ్చన్నారు.
అయితే, తాము మాత్రం అందరినీ కలుపుకుని పనిచేస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతిపక్షాలు కూడా కలిసి రావాలన్నారు. అలా కాదని ప్రతిపక్ష పార్టీ పైఎత్తులు వేస్తామంటూ తాము కూడా చూస్తామన్నారు.
వ్యవసాయం కుటుంబం, నల్లమల అడవుల నుంచి ఇక్కడివరకూ వచ్చామన్నారు. తాము మేనేజ్ మెంట్ కోటాలో లేదా తండ్రి, తాత పేరు చెప్పి రాలేదంటూ బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. జడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం హోదాకు చేరుకున్నానని రేవంత్ చెప్పారు. తాను గతంలో ఎంపీగా సచివాలయానికి వెళితే పోలీసులతో బంధించి ఇంటిదగ్గర పడేశారని చెప్పారు. సీతక్క వినతిపత్రం ఇస్తామని వస్తే అడ్డుకున్నారని చెప్పారు. సచివాలయం ఎవరి కోసం కట్టారని ప్రశ్నించారు. ప్రజలేరాని సచివాలయం ఎందుకన్నారు.
అందుకే తాము వచ్చిన తర్వాత ప్రగతిభవన్ గేట్లు బద్దలు కొట్టామని.. సచివాలయం గేట్లు బార్లా తెరిచామని రేవంత్ చెప్పారు. సీఎంను, మంత్రులను అందరూ కలవవచ్చన్నారు. ప్రజాతీర్పును గౌరవించాలని ప్రతిపక్ష నేతలకు సూచించారు.
అన్ని పార్టీల ఎమ్మెల్యేలు తనను కలవవచ్చన్నారు రేవంత్. అనవసర ప్రచారాలు వద్దన్నారు. తనకు రైతు బిడ్డగా చిన్న వయస్సులో గొప్ప అవకాశం వచ్చిందన్నారు. మనరాష్ట్రాన్ని అందరం కలిసి పునర్నిర్మించుకుందామని రేవంత్ పిలుపునిచ్చారు.
-
ఉమెన్స్ డే వేళ సీఎం రేవంత్ ఊహించని కానుక..!! -
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్‌ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
ఆ జిల్లాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చిన ఐఎండీ! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
కర్ణాటకలో 'రోహిత్ వేముల చట్టం'..! కుల వివక్షను అరికట్టేందుకే.. -
కేరళంలో 5 గ్యారంటీలను ప్రకటించిన రాహుల్ గాంధీ.. -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications