2029 ఎన్నికల్లో ఇవే ఫలితాలు రిపీట్.. కేసీఆర్ వల్ల లాభం లేదనే ఈ తీర్పు!
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మూడు దశల గ్రామపంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2029 అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి మాట్లాడారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది: సీఎం రేవంత్
పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 12 వేలకు పైగా గ్రామపంచాయతీలలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి అన్నారు. మొత్తం 12,702 పంచాయతీలకు కాంగ్రెస్ 7,527 చోట్ల, కాంగ్రెస్ రెబల్స్ 808 చోట్ల గెలిచారని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, కాంగ్రెస్ రెబల్స్ కలిపి 8,335 పంచాయతీలు అంటే 66% ఫలితాలను సాధించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

పాలన చేపట్టి రెండేళ్ళయినా ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించారు
బీఆర్ఎస్, బిజెపి ఒక కూటమిగా ఈ ఎన్నికలలో పోటీ చేసి 3511 బీఆర్ఎస్ స్థానాలను, 710 బిజెపి స్థానాలను దక్కించుకున్నాయన్నారు. ఈ కూటమి మొత్తం 4221 స్థానాలను దక్కించుకుందని. మిగిలిన 146 గ్రామ పంచాయతీలలో సిపిఐ, సిపిఎం, ఇతర పార్టీలు గెలిచాయి అన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని సీఎం పేర్కొన్నారు.
మూసీలో కాలుష్యం కంటే ఒకాయన మాటల్లో విషం ఎక్కువ
పంచాయతీ ఎన్నికలు తమ పాలనకు ప్రజలు ఇచ్చిన రెఫరండం అని, 94 శాసనసభ నియోజకవర్గాలలో ఎన్నికలు జరిగితే 87 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వారికి ఇంకా అహంకారం తగ్గలేదని పేర్కొన్న రేవంత్ రెడ్డి కెసిఆర్ ను టార్గెట్ చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీలో కాలుష్యం కంటే ఒకాయన మాటల్లో విషం ఎక్కువ అంటూ విమర్శించారు.
కేసీఆర్ వల్ల లాభం లేదనే ప్రజల తీర్పు
బరితెగించి ఇబ్బంది పెడతామంటే కుదరదని స్పష్టం చేశారు. 2029లో కూడా ఈ తీర్పు రిపీట్ అవుతుంది అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అహంకారం, అసూయ తగ్గించుకోండి అంటూ టార్గెట్ చేశారు. కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరని గజ్వేల్ ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. గజ్వేల్‌లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలిచిందని, కేసీఆర్ వల్ల లాభం లేదని గజ్వేల్ ప్రజలు మాకు తీర్పు ఇచ్చారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications