'తెలంగాణలో కొత్తగా మరో 4 ఎయిర్ పోర్టులు'
తెలంగాణ బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకునేందుకు విజన్ డాక్యుమెంట్ తయారు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విజన్ డాక్యుమెంట్- 2047 లో విజన్, స్ట్రాటజీ అనేవి రెండు అంశాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో తెలంగాణలో మరో 4 విమానాశ్రయాలు తీసుకొస్తున్నట్లు వివరించారు. వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, రామగుండంలో ఎయిర్ పోర్టులు రాబోతున్నాయని తెలిపారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపటినుంచి రాష్ట్రవ్యాప్తంగా 'ప్రజా పాలన ఉత్సవాలు' నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 9 వరకు రోజూ ఒక ఉమ్మడి జిల్లాలో ఈ ప్రజా పాలన ఉత్సవాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను భవిష్యత్తు తరాల కోసం పాలసీ డాక్యూమెంట్ గా జాతికి అంకితం ఇవ్వబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచ దేశాల్లో ఉన్న దిగ్గజ కంపెనీలను మన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి తద్వారా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తామన్నరు. విజన్ డాక్యుమెంట్ ను తెలంగాణ రైజింగ్ 2047 గా పిలుస్తున్నామని.. విజన్, స్టాటజీ .. రెండు అంశాలు ఇందులో ఉంటాయని వివరించారు. విజన్ డాక్యూమెంట్ లో లక్షలాది మంది భాగస్వాములను చేస్తున్నామని.. నీతి అయోగ్,ఐఎస్ బీ లాంటి సంస్థల సహకారంతో డాక్యూమెంట్ ను తయారు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం మూడు విభాగాలుగా..
"ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించాం. అవుటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని మొత్తం ప్రణాళిక బద్దమైనఅభివృద్ది కోసం కోర్ అర్భన్ రీజన్ ఎకానమి గా చూస్తున్నాం. కాలుష్య రహిత సిటీగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మెట్రోపాలిటన్ సిటీలు ప్రస్తుతం కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కోర్ అర్భన్ రీజన్ ను సర్వీస్ సెక్టర్ గా మారుస్తున్నాం. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను కోర్ అర్భన్ రీజన్ నుంచి తరలిస్తున్నాం. కోర్ అర్భన్ రీజన్ లో మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ వంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అవుటర్ రింగ్ అవతలి భాగంలో రీజనల్ రింగ్ రోడ్లు రాబోతున్నాయి. రీజనల్ రింగ్ రోడ్లు 360 కిలోమీటర్ల దూరం ఉండనుంది. పెరీ అర్భన్ రీజనల్ ఎకానమి గా దీన్ని పిలుస్తాం" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
"భారత్ ప్యూచర్ సీటీ తో పాటు అనేకం ఈ రీజనల్ లో ఉండబోతున్నాయి. గ్రీన్ ఫీల్డ్ హైవే, బుల్లెట్ ట్రైన్ వంటివి ఇక్కడ రాబోతున్నాయి. మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ తీసుకువస్తున్నాం. తెలంగాణ లో ఇంకా ఎయిర్ పోర్టులు రావాల్సి ఉంది. వరంగల్ ,ఆదిలాబాద్, కొత్తగూడెం, రామగుండం లో ఎయిర్ పోర్టులు తీసుకురాబోతున్నాం. హైవే,పోర్ట్, ఎయిర్ పోర్టు కనెక్టివిటీ వల్ల పెట్టుబడులు తీసుకువచ్చి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తాం. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు మూడో రీజియన్ గా చూస్తున్నాం. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్ష్యం చేయం. రాష్ట్ర ఆర్థికాభివ్రుద్దిలో రైతులను భాగస్వాములను చేస్తాం.తెలంగాణ భూములు విత్తనాలను ఉత్పత్తి చేయడానికి బాగా అనుకూలం. క్యూర్, ప్యూర్ ,రేర్ లా తెలంగాణ ముఖ చిత్రాన్ని చూస్తున్నాం. ఈ మూడింటిని క్రోడికరించి తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యూమెంట్ ఉండబోతుంది." అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
"తెలంగాణలోని అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని అభివ్రుద్ది ప్రణాళికలు రచిస్తున్నాం. దేశానికి అవసరం అయిన దానికంటే అహారధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నాం. కాని న్యూట్రిషన్ పుడ్ ఇవ్వలేకపోతున్నాం. అందరికి విద్య అందుబాటులో ఉన్నప్పటికి నాణ్యమైన విద్య , సాంకేతిక విధ్య అందుబాటులో లేదు. అంతర్జాతీయ విద్యా సంస్థలను రాష్ట్రానికి రప్పించి నాలెడ్జ్ హబ్ ను క్రియేట్ చేస్తాం.. 2034 కు 1 ట్రిలియన్, 2047 3 ట్రిలియన్ డాలర్ ఎకానమి గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
"దేశంలో తెలంగాణ వాటా 10 శాతానికి పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మా దార్శనికతనే మా భవిష్యత్తు ప్రణాళికలు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు అనేక మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నాం. ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో వార్ రూం ఏర్పాటు చేశాం. చైనా, జపాన్ , సౌత్ కొరియా, సింగపూర్ మాకు రోల్ మోడల్.. వాళ్లనే ఆదర్శంగా తీసుకుని పోటీ పడతాం. ఆంధ్రా, తమిళనాడు , మరో రాష్ట్రం మాకు పోటీ కాదు. విదేశాల నుంచి నేరుగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రధాని మోదీ, రాహుల్ కు ఆహ్వానం..
భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబరు 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి ఆహ్వానించనున్నారు. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ ఆర్థికవేత్తలు, క్రీడాకారులు, మీడియా ప్రముఖులు, దౌత్యవేత్తలు, వివిధ రంగాల నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించనుంది.
సదస్సుకు ఆహ్వానించే వారి స్థాయికి తగినట్లు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఆహ్వానాలు అందించనున్నారు. ఇందుకోసం ఆహ్వాన కమిటీని నియమించనున్నారు. ఈ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వెబ్ సైట్ ను ఏర్పాటు చేస్తారు. ఎవరిని ఆహ్వానించారు.. ఎవరు ఆహ్వానించారు.. వారి రాకను నిర్ధారించడం, వచ్చే వారికి తగిన వసతులు కల్పించడంతో పాటు వారికి లైజనింగ్ చేసేందుకు ఉన్నతాధికారుల నియామకం అన్నింటిని ఆహ్వాన కమిటీ నిర్ధారించనుంది.

ఈ ఆహ్వాన కమిటీని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ సమన్వయం చేయనున్నారు. ఆహ్వానాలకు సంబంధించిన వివరాలను డ్యాష్ బోర్డు ద్వారా సీఎం పర్యవేక్షించనున్నారు. వివిధ రంగాలకు సంబంధించి ఇప్పటికే 4,500 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు పంపామని.. అందులో 1000 మంది ఇప్పటికే తమ రాకను నిర్ధారించారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.
-
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications