అందులో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డికి పీహెచ్. డీ!
అబద్దాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డికి పిహెచ్డి ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆరు గ్యారెంటీల మోసాన్ని గ్రహించి మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ను ఓడించారని మాజీ మంత్రి హరీష్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్ రెడ్డి, కళ్ళు తెరవాలని, బుద్ధి తెచ్చుకోవాలని వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి పైన హరీష్ రావు తీవ్ర విమర్శలు
నేడు కరీంనగర్లోని హుజురాబాద్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేశారు.
జులై 19 చర్ల లో ఫార్మా సిటి అంటూ ప్రభుత్వం గెజిట్ ఇచ్చి ఇప్పుడు లగచర్లలో ఫార్మా సిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ సీఎం మాట మార్చడం పైన ఆయన టార్గెట్ చేశారు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన గెజిట్ పైనే అబద్ధాలు ఆడుతున్నావని రేవంత్ రెడ్డిని విమర్శించారు.

ఆ జీవో రద్దు చేసి కొత్త గెజిట్ ఇవ్వు రేవంత్
ప్రజలకు క్షమాపణ చెప్పి గెజిట్ వెనక్కి తీసుకున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించాలని, ఆ జీవో రద్దు చేసి కొత్త గెజిట్ ఇస్తేనే ప్రజలు నమ్ముతారని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. పచ్చని పంటలు పండే భూములను తొండలు గుడ్డు పెట్టని భూములు గా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్ లో దళిత సోదరులపైన అక్రమ కేసులను పెట్టి ఇబ్బందులు పెడుతున్నారన్నారు.
దళిత బంధుపై హరీష్ రావు డిమాండ్
హుజరాబాద్లో 18,500 మందికి కేసిఆర్ దళిత బందు మంజూరు చేస్తే వీరిలో కొందరికి ఆగిపోయిన ఐదు లక్షల డబ్బులు ఇవ్వమంటే పోలీసులతో దాడి చేసి, లాఠీచార్జి చేయించారని హరీష్ రావు మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రి దళితులకు చేసే మేలు ఇదేనా అంటూ నిలదీశారు. వెంటనే దళిత బంధు డబ్బులు ఇవ్వాలన్నారు. దళిత బంధు అకౌంట్ ల ఫ్రీజింగ్ ఎత్తివేసి వారికి డబ్బులను విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు తక్షణం అమలు చెయ్యాలి
డిసెంబర్ 9 నుంచి జరిగే అసెంబ్లీలో దళితుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇచ్చిన విధం గా పెన్షనర్ లకు పాత బకాయిలతో సహా పెన్షన్లు చెల్లించాలని హరీష్ రావు అన్నారు. నూట ఒక్క దేవుళ్ళ పై ప్రమాణం చేసి తెలంగాణా ప్రజలను మోసం చేశారన్నారు.
మూసి నదికి నీళ్లు తీసుకెళ్లడానికి టెండర్లు ఎలా పిలుస్తున్నారు
మహారాష్ట్ర లో తెలంగాణ మంత్రులు ప్రచారం చేసిన స్థానాల్లో మహారాష్ట్ర ప్రజలు ఓడగొట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అబద్ధాలు ఆడిన ముఖ్యమంత్రి ఇప్పుడు హైదారాబాద్ కు మూసి నదికి నీళ్లు తీసుకెళ్లడానికి టెండర్లు ఎలా పిలుస్తున్నారని ప్రశ్నించారు. రైతులను మోసం చేసి మహబూబాబాద్ లో ఎలా సంబరాలు చేసుకుంటారని హేళన చేశారు.












Click it and Unblock the Notifications