ఢిల్లీలో రేవంత్- మోదీతో కీలక ప్రతిపాదనలు
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. కొందరు కేంద్ర మంత్రులనూ కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా కొన్ని కీలక ప్రతిపాదనలను వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు.
మెట్రో విస్తరణ..
మెట్రో రైల్ కారిడార్‌ను నగర శివార్లకూ విస్తరించాలని ప్రతిపాదించింది రేవంత్ సర్కార్. దీనికి సంబంధించిన డీపీఆర్ సిద్ధమైంది. మేడ్చల్, షామీర్‌పేట్‌తో పాటు ప్యూచర్ సిటీ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను కూడా వేగవంతం చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ కారిడార్ సర్వే పనులు శరవేగంగా కొనసాగుతోన్నాయి కూడా.

శంషాబాద్ టు..
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్యూచర్ సిటీ వరకు ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి రానుంది. హెచ్ఎండీఏ, టీజీఐఐసీ, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంయుక్తంగా సర్వే చేపట్టాయి. రావిర్యాల నుండి స్కిల్ యూనివర్సిటీ వరకు దాదాపు 22 కిలోమీటర్ల మేర ఇది నిర్మితం కానుంది.
నిధుల మంజూరు..
కొంగరకలాన్ మీదుగా మీర్ ఖాన్ పేట్ వరకు నిర్మించదలిచిన గ్రీన్ ఫీల్డ్ రహదారిని మెట్రో రైల్‌కి కేటాయించారు. రోడ్ మధ్యలో మెట్రో ట్రాక్ అందుబాటులోకి వస్తుంది. దీనికి కేంద్రం నుంచి నిధులను కోరుతోంది ప్రభుత్వం. ఈ ప్రతిపాదనలను సంబంధిత కేంద్రమంత్రులకు అందజేసే అవకాశం ఉంది.
బీసీ రిజర్వేషన్లు..
మూసీ రెజునవేషన్ ప్రాజెక్ట్‌కు కూడా నిధులను కేటాయించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనితో పాటు బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే అంశాన్నీ రేవంత్ రెడ్డి.. ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామంటూ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో భాగంగా ఈ అంశాన్ని ఆయనతో చర్చిస్తారని తెలుస్తోంది,












Click it and Unblock the Notifications