టీడీపీ క్యాడర్ కు రేవంత్ సంచలన పిలుపు..! చంద్రబాబును దెబ్బతీసినోళ్లను..!

తెలంగాణలో ఒకప్పుడు ఓట్లు, సీట్లు, క్యాడర్ తో పటిష్టంగా ఉన్న టీడీపీ.. రాష్ట్ర విభజన తర్వాత కుదేలైంది. దీనికి ప్రధాన కారణం తెలంగాణ సెంటిమెంట్. తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమే రాజకీయాలు చేయాలని, ఇతరులెవరూ ఉండొద్దనే విధంగా కేసీఆర్, ఆయన కుటుంబం చేసిన ప్రయత్నాలతో టీడీపీ ఇక్కడ కనుమరుగైంది. తిరిగి ఇప్పుడు తన మాజీ పార్టీ టీడీపీకి ప్రాణం పోసేందుకు ప్రయత్నిస్తున్నారో లేక కాంగ్రెస్ బద్ధ శత్రువును టార్గెట్ చేయాలనుకుంటున్నారో తెలియదు కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ టీడీపీ క్యాడర్ కు అనూహ్య పిలుపునిచ్చారు.

ఇవాళ ఖమ్మంలో జరిగిన సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ఎన్టీఆర్ కు అభిమానులు, చంద్రబాబుకు సహచరులు, అనుచరులు ఉన్నారని తెలిపారు. వాళ్లందరికీ తన విజ్ఞప్తి ఒక్కటేనని, తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలని చూసిన బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలన్నారు. అదే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అన్నారు. తద్వారా తమ ఉమ్మడి శత్రువును రూపుమాపేందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని టీడీపీని కోరినట్లయింది.

CM Revanth Reddy Urges TDP Cadre Demolish BRS Flag Blocks in Tribute to NTR

తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఉండొద్దని తెలుగు దేశం పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను వంద మీటర్ల గొయ్యి తీసి పాతిబెట్టినప్పుడే ఎన్టీఆర్ కు నివాళి అని రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ గద్దెలు దిగాలని, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలని, అప్పుడే నందమూరి తారకరామారావుకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్లం అవుతామన్నారు. బీఆర్ఎస్ ను బొందపెట్టల్సిన బాధ్యత మనమీద ఉందంటూ టీడీపీ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి సూచించారు. మరోవైపు సొంత పార్టీ కాంగ్రెస్ ను వదిలి.. టీడీపీని, ఎన్టీఆర్ ను పొగుడుతూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో చర్చనీయాంశమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+