నేను,భట్టి జోడెద్దుల్లా శ్రమిస్తున్నాం..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ రవీంధ్రభారతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి విశ్వావసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్ర ప్రజలకు విశ్వావసు నామ సంవత్సరం అందరికీ సంతోషాలను అందించాలని,సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లల్లో ఉండాలని..ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందరికీ లభించాలని కోరుకుంటున్నానని ఆయన కోరుకున్నారు.

రాష్ట్రం కోసం తాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జోడెద్దుల్లా శ్రమిస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇలాగే నిరంతం శ్రమిస్తూనే ఉంటామని ఆయన అన్నారు. వ్యవసాయ అభివృద్ధికి, పేదలకు విద్య అందిచేందుకు బడ్జెట్ లో ప్రాధాన్యం ఇచ్చామని, విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమం అన్నిటికీ బడ్జెట్ లో నిధులు కేటాయించామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.రాష్ట్రంలోని యువతకు లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రపంచస్థాయిలో హైదరాబాద్‌కు గుర్తింపు ఉండాలి. మూసీ ప్రక్షాళన, రీజనల్‌ రింగ్‌ రోడ్డు, ఫ్యూచర్‌ సిటీ ఇందులో భాగమే.

CM Revanth Reddy wishes Ugadi to the people of Telangana

శాంతి భద్రతలు అదుపులోకి ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నాం. తెలంగాణ రైజింగ్ అంటూ ...దేశంలో తెలంగాణ ఒక వెలుగు వెలగాలి... దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు.దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాలి. ఫ్యూచర్‌ సిటీని నిర్మించి దేశానికి ఆదర్శంగా నిలుస్తాం. పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్‌ సిటీ రూపకల్పన జరుగుతుందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు.ప్రపంచస్థాయిలో హైదరాబాద్‎కు గుర్తింపు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామన్నారు. భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ ఉగాది పచ్చడిలా షడ్రుచుల సమ్మిళితం. వ్యవసాయ అభివృద్ధికి, పేదలకు విద్య అందిచేందుకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. దేశంలోనే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ను తీసుకొచ్చి పేదలకు ఆకలి దూరం చేసేందుకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుడు పేదలకు సన్నబియ్యం అందించే పథకానికి ఉగాది రోజున శ్రీకారం చుడుతున్నామని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+