రైతులకు రూ. 2747.67 కోట్లు విడుదల చేసిన సీఎం రేవంత్
మాయగాళ్ల మాటలు నమ్మి జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవద్దని పాలమూరు ప్రజలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో మూడు రోజులపాటు జరిగిన రైతు పండుగ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్గ సహచరులు, సలహాదారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దాదాపు 18 వేల కోట్ల రూపాయలతో 22 లక్షల రైతు కుటుంబాలకు ఇప్పటికే రుణమాఫీ చేయగా, తాజాగా ఈ వేదిక నుంచి మరో 3,13,897 మంది రైతు కుటుంబాలకు రుణ మాఫీ చేస్తూ అందుకు అవసరమైన 2747.67 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ విడుదల చేశారు.
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతు కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలోనే ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ ప్రజా ప్రభుత్వం మాత్రమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

తాజాగా విడుదల చేసిన నిధులతో రాష్ట్రంలో మొత్తంగా 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ జరిగింది. ఈ నిధులను విడుదల చేయడంతో పాటు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మహిళా సమాఖ్య కోసం 255 కోట్ల రూపాయలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వానికి ఇకనుంచి రైతులే బ్రాండ్ అంబాసిడర్లు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు పారనప్పటికీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా, ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంతగా 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి రికార్డు సృష్టించామన్నారు.
రైతే రాజు అని ప్రభుత్వం రైతన్నలకు రుణమాఫీ చేయడంతో పాటు వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే అన్న పరిస్థితుల నుంచి రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించడమే కాకుండా ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇచ్చిన సందర్భంలో రైతు పండుగ చేసుకుంటున్నం. గ్రీన్ చానెల్లో నిధులు విడుదల చేయించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీళ్లు పారించే బాధ్యత తీసుకుంటామన్నారు సీఎం రేవంత్.
కొడంగల్ రుణం తీర్చుకోవాలని 1300 భూ సేకరణ చేసి పరిశ్రమలు స్థాపించి 25 వేల మంది మహిళలకు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రయత్నం చేస్తుంటే కొందరు అడ్డుపడుతున్నరు. అమాయకులను రెచ్చగొడుతున్నరు. భూమి అందరికీ ఆత్మగౌరవం. అభివృద్ధి జరగాలంటే భూ సేకరణ తప్పడం లేదు. అవసరమైతే భూ సేకరణకు రెట్టింపు పరిహారం చెల్లించడమే కాకుండా నష్టపోయిన కుటుంబాల పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయయని సీఎం రేవంత్ వివరించారు.

ఇక్కడ పుట్టిన వాడిని... గిట్టేది కూడా ఈ గడ్డమీదే. ముఖ్యమంత్రిగా ఉండి ఈ జిల్లాకు నీళ్లు ఇవ్వకపోతే, నిధులు ఇవ్వకపోతే, అభివృద్ధి చేయకపోతే చరిత్ర క్షమించదు. జిల్లా వాసిగా నా బాధ్యత నాకు తెలుసు. భారీ స్థాయిలో జరిగిన ఈ రైతు పండుగలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సలహాదార్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
-
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications