కేసీఆర్ కు సీఎం రేవంత్ సంచలన సవాల్
గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు మీద అసెంబ్లీలో చర్చకు సిద్ధమా కేసీఆర్..? అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. గోదావరిలోకి 3 వేల టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది మీరు కాదా? అని ప్రశ్నించారు. సోనియా గాంధీకి అండగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు రైతు భరోసా విజయోత్సవ సభలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై శాసనసభలో చర్చ పెడదామని.. స్పీకర్ కు లేఖ రాయమని సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందెవరో అసెంబ్లీలో చర్చింద్దాం రమ్మని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. 2016లో గోదావరిలోకి 3 వేల టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది మీరు కాదా? అని నిలదీశారు.
రైతు భరోసా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలన ఎలా ఉందో.. కాంగ్రెస్ 18 నెలల పాలన ఎలా ఉందో చర్చపెట్టాలన్నారు. కేసీఆర్.. కుట్రలు కుతంత్రాలతో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందెవరో అసెంబ్లీలో చర్చింద్దాం రమ్మని సవాల్ విసిరారు. 2016లో గోదావరిలోకి 3 వేల టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది మీరు కాదా? అని నిలదీశారు.
కాళేశ్వరం కూలేశ్వరమైందని దుయ్యబట్టారు. కల్వకుర్తి ఎందుకు ఆగిపోయింది? రూ.300 కోట్లతో పూర్తి కావాల్సిన బీమా, రూ.200 కోట్లతో పూర్తి కావాల్సిన నెట్టెంపాడు ఎందుకు పూర్తి కాలేదు? రూ.6 వేల కోట్లతో పూర్తి కావాల్సిన సీతారామ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయిందని కేసీఆర్ పై మండిపడ్డారు సీఎం రేవంత్. పదేళ్లలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశావా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
"గోదావరి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో నాపై దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారు. నేను చంద్రబాబుతో అంటకాగాలనుకుంటే అక్కడే ఉండేవాణ్ణి? సోనియమ్మను నమ్మకద్రోహం చేసిన చరిత్ర నీదైతే... తెలంగాణలో ప్రజా ప్రభుత్వం తేవాలని చంద్రబాబును కాదని కాంగ్రెస్ లో చేరి ప్రజలతో కదం కదం కలిపాను" అని సీఎం రేవంత్ అన్నారు.

లక్షా 4 వేల కోట్ల రూపాయలతో రైతును రాజును చేసిన ప్రభుత్వం తమదని సీఎం రేవంత్ అన్నారు. వ్యవసాయం అంటే రైతుకు సాయం చేయడం. కాళేశ్వరం పేరుతో కమిషన్లు తీసుకున్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పాం. అందుకే మహిళలకు పెట్రోల్ బంకులు పెట్టించాం. ప్రజా పాలనలో అందరూ భద్రంగా ఉండాలని చూస్తున్నాం. పదేళ్ల కేసీఆర్ పాలన.. 18 నెలల మా పాలనపై ఎక్కడికక్కడ చర్చ పెట్టండి అని సీఎం రేవంత్ సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications