రేవంత్ కు ఢిల్లీ పిలుపు - మారుతున్న లెక్కలు, కీలక నిర్ణయం..!!

తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశాలు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి. అటు పార్టీ మారిన ఎమ్మెల్యేల పై అనర్హత కేసు సుప్రీంలో ఈ నెల 10న విచారణకు రానుంది. పార్టీలో చోటు చేసుకుంటున్న కీలక పరిణామాల వేళ సీఎం రేవంత్ సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసారు. అటు ఢిల్లీ నుంచి రేవంత్ కు పిలుపు వచ్చింది. రాష్ట్రం లో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ.. తాజా పరిణామాలు రాజకీయంగా ఉత్కంఠ ను పెంచుతున్నాయి.

కీలక పరిణామాలు
తెలంగాణ అధికార పార్టీలో అసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు సీఎం రేవంత్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను సీఎం రేవంత్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కానీ, సొంత పార్టీలోనే కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదంగా మారాయి. కొందరు ఎమ్మెల్యేలు ప్రత్యేక భేటీలు అనేక సందేహాలకు కారణం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ సీఎల్పీ సమావేశానికి నిర్ణయించారు. ఈ రోజు జరిగే ఈ సమావేశంలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించ నున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక, స్థానిక సంస్థల ఎన్నికలు రేవంత్ సమర్థతకు పరీక్షగా మారుతున్నాయి.

CM Revanth to preside over a key CLP meeting ahead announcement of local body elections

ఎమ్మెల్యేకు దిశా నిర్దేశం
దీంతో, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యేలకు రేవంత్ స్పష్టమైన కార్యచరణ ఫిక్స్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వేలపై తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశంపైనా మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ భరోసా ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఉంటుం దని .. ఏ సమస్య ఉన్నా తన వద్దకు రావాలని రేవంత్ చెప్పే అవకాశం ఉంది. పార్టీ నేతలంతా కలిసి కట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పని చేయాలని సూచించనున్నారు. అదే సమయంలో పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల పైన అభిప్రాయాలు కోరనున్నారు. త్వరలోనే జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీకి రేవంత్ నిర్ణయించారు.

ఢిల్లీకి పిలుపు
ఈ సమయంలోనే ఢిల్లీకి రావాలని రేవంత్ పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఈ రోజు ఢిల్లీలో సాయంత్రం ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో రేవంత్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ , టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పాల్గొంటారు. కేబినెట్ విస్తరణ, పార్టీ పదవులపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కులగణనకు సంబంధించిన నివేదికను ప్రవేశపెట్టి.. ఎస్సీ వర్గీకరణ నివేదికను ఆమోదం గురించి అధిష్ఠానానికి వివరాలు అందిచను న్నారు. ఈ పర్యటనలోనే రేవంత్ పార్టీ ముఖ్య నేత రాహుల్ తోనూ భేటీ కానున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన తరువాత కేబినెట్ విస్తరణ.. నామినేటెడ్ పదవులు.. స్థానిక సంస్థల ఎన్నికల పైన కీలక నిర్ణయాలు ఉంటాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో, నేడు జరిగే సీఎల్పీ భేటీ.. రేవంత్ ఢిల్లీ పర్యటన పైన ఆసక్తి కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+