బొగ్గుబ్లాకుల వేలం రగడ: లోక్ సభలో లేవనెత్తిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ .. ఏమన్నారంటే
తెలంగాణ రాష్ట్రంలో 4 బొగ్గు బ్లాకులను వేలం వెయ్యాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి బొగ్గు గని కార్మికులు మూడు రోజులపాటు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే బొగ్గు బ్లాకుల వేలం పై కేంద్రంలోని బిజెపి సర్కార్ ను, రాష్ట్రంలోని బిజెపి నాయకులను టార్గెట్ చేస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే, తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ జాబితాలో చేరింది. ఇప్పటికే టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి బొగ్గు బ్లాకుల వేలం నిలిపివేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాసి కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేశారు. ఇక తాజాగా మాజీ తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్ సభలో ఈరోజు జీరో అవర్లో బొగ్గు గనుల వేలం విషయాన్ని ప్రస్తావించి కేంద్ర సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు.

బొగ్గు బ్లాకుల వేలంపై తెలంగాణలో రగడ
తెలంగాణ పరిధిలోని సత్తుపల్లి, కొత్తగూడెం, శ్రావణ పల్లి, కళ్యాణ్ ఖని లోని నాలుగు బ్లాక్ లను వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కార్ తెలంగాణ ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ మినహా రాజకీయ పార్టీల నాయకులు అందరూ బొగ్గు బ్లాకుల వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక మూడు రోజుల పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని కార్మికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.

కేంద్రం వెంటనే వేలం ప్రక్రియను నిలిపివేయాలన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
సింగరేణి కార్మికుల సమ్మెతో ఏకంగా 120 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. ఇక లోక్ సభ లోనూ ఈ విషయాన్ని ప్రస్తావించిన నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాభాలు ఆర్జిస్తున్న తెలంగాణ క్యాలరీస్ ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించకుండా బొగ్గు బ్లాకులను వేలం వేయాలని నిర్ణయం తీసుకోవడం అసమంజసమని పేర్కొన్నారు. కేంద్రం వెంటనే వేలం ప్రక్రియను నిలిపివేయాలని పేర్కొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సింగరేణికి వందేళ్ల చరిత్ర ఉందని పేర్కొన్నారు.

లోక్ సభలో బొగ్గు బ్లాకుల వేలం అంశాన్ని ప్రస్తావించిన నల్గొండ ఎంపీ
సింగరేణి కాలరీస్ లో తెలంగాణ ప్రభుత్వంతో పాటుగా కేంద్రానికి కూడా వాటాలు ఉన్నాయని గుర్తు చేసిన ఆయన ఈ వ్యవహారంపై కేంద్రం తక్షణం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సింగరేణి బొగ్గు సరఫరా చేస్తుందని బొగ్గు గనుల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ప్రభుత్వ రంగ సంస్థకే వీటిని అప్పగించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్ సభ వేదికగా బొగ్గు గనుల వేలం అంశాన్ని ప్రస్తావించారు.

దేశ వ్యాప్తంగా 88బొగ్గు బ్లాకుల వేలం.. తెలంగాణా బ్లాకుల వేలంతో దుమారం
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాకుల వేలం పై ఇటీవల కేంద్రం ప్రకటనను విడుదల చేసింది. ఈ వేలం ప్రకటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణాకు ఈ ప్రకటన షాక్ ఇచ్చింది. కేంద్రం ఇటీవల ప్రకటించిన బొగ్గు బ్లాకుల వేలంలో ఇప్పటికే సింగరేణి బొగ్గు లభ్యతపై అన్వేషణ సాగిస్తున్న తెలంగాణా బ్లాకులు సింగరేణి వర్గాలలో, తెలంగాణా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం బ్లాక్ 3, ఖమ్మం జిల్లా సత్తుపల్లి బ్లాక్ 3, మంచిర్యాల జిల్లా కళ్యాణఖని బ్లాక్ 6, శ్రావణ పల్లి లోని ఓ బ్లాక్ లను వేలం వేయడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో దుమారం రేపింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications