Rains: ఉత్తర, తూర్పు తెలంగాణలో విస్తారంగా వర్షాలు..
తూర్పు, ఉత్తర తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రాజెక్టులలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలక కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం వద్ద సరుకులతో వెళ్తున్న వాహనం వరద నీటిలో కొట్టుకుపోయింది. స్థానికులు డ్రైవర్ ను కాపాడారు. భారీ వర్షాలతో భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో పలు గ్రామాలు నీటమునిగాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో జలాశయాలు పూర్తి స్థాయిలో నిండిపోయాయి. మొన్నటి వరకు 10 అడుగుల వద్ద ప్రవహిస్తున్నన గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. గోదావరి నది స్నానఘట్టాల వరకు వరద నీరు వచ్చింది. ఇసుక తిన్నెలు అన్ని వరద నీటిలో మునిగాయి. గోదావరి నీటి మట్టం శనివారం ఉదయం 31 అడుగుల వద్దకు చేరింది. 43 అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి వస్తోంది.
శనివారం ఉదయం ప్రాజెక్టు 20 గేట్లను ఎత్తి 66వేల 900 క్యూసెక్కుల వరద నీరు కిందికి విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెద్ద వాగు ప్రాజెక్టు కు గురువారం రాత్రి గండి పడిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని సరిహద్దు గ్రామాల్లో భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో 600 ఎకరాల్లో, ఏపీలో వేల ఎకరాల పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. ఈ వాగు కింద రాష్ట్రంలోని అశ్వారావుపేటలో దాదాపు 2,300 ఆయకట్టు ఉండగా, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 15వేల ఎకరాల్లో ఆయకట్టు ఉంది.












Click it and Unblock the Notifications