బిర్యానీలో బొద్దింక: మూసివేసిన ఆ రెస్టారెంట్ నుంచి ఆర్డర్లు ఎలా వెళ్తున్నాయ్?

హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్‌పై తాజాగా, ఓ కస్టమర్ ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ రెస్టారెంట్‌లోనే సిబ్బంది దాడి చేయడంతో ఓ కస్టమర్ మృతి చెందిన ఘటన కొన్ని రోజుల క్రితం చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో రెస్టారెంట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలోనే మరోసారి ఈ రెస్టారెంట్ వార్తల్లోనిలిచింది.

నిఖిల్ అనే వ్యక్తి.. తన ట్విట్టర్ ఖాతాలో తన ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను వెల్లడించాడు. పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్ నుంచి మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఆ బిర్యానీలో బొద్దింక వచ్చింది. ఆ రెస్టారెంట్ వంట గదిని పరిశీలించాలని కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్‌కు, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌కు ట్యాగ్ చేశాడు.

‘Cockroach in biryani’: customer seeks action against restaurant in Hyderabad

అయితే, ప్రస్తుతం మెరిడియన్ రెస్టారెంట్ మూసివేసి ఉంది. కానీ, ఆన్‌లైన్ ఆర్డర్లు మాత్రం స్వీకరిస్తున్నారని నిఖిల్ ట్వీట్‌తో వెల్లడైంది. స్విగ్గీ, జొమాటో నుంచి ఆన్‌లైన్ ఆర్డర్లు తీసుకుంటూ.. బయట నుంచి మెరిడియన్ బ్రాండ్ పేరుతో.. బయట వంటగది ఏర్పాటు చేసి డెలివరీలు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, నిఖిల్ ట్వీట్‌కు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించారు. మెరిడియన్ రెస్టారెంట్ మూసివేసి ఉంది.. అయినా మీ సమాచారంపై విచారణ చేస్తామని పేర్కొన్నారు.

విజేత సూపర్ మార్కెట్‌ను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్

పరిసరాల పరిశుభత్ర పాటించని ఓ సూపర్ మార్కెట్‌కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) షాకిచ్చింది. రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్‌గూడలో విజేత సూపర్ మార్కెట్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సీజ్ చేశారు. రాజేంద్రనగర్‌లో అధికారులతో కలిసి మంగళవారం పర్యటించారు.

ఈ క్రమంలో ఆయన ముందే చెత్తను రోడ్డుపై పడేశారు విజేత సూపర్ మార్కెట్ సిబ్బంది. దీంతో సీరియస్ అయిన రోనాల్డ్ రాస్.. వెంటనే ఆ సూపర్ మార్కెట్‌ను సీజ్ చేసి రూ. 50 వేలు జరిమాణా విధించారు. దీంతో పరిశుభ్రతను పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని సంకేతాలిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+