వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్​కు ఎల్లో అలర్ట్.. దారుణంగా పడిపోనున్నఉష్ణోగ్రతలు

హైదరాబాద్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రేపటి నుండి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని, పొగ మంచు ఎక్కువగా కురుస్తుందని అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చలి పంజా విసురుతుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాదులో గురువారం నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

హైదరాబాద్లో సుమారు 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా బుధవారం నాడు 15 డిగ్రీలు, గురువారం నాడు 12 డిగ్రీలు, శుక్రవారంనాడు 13 డిగ్రీల ఉష్ణోగ్రత రేపు అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా మంచు కురిచే అవకాశం ఉందని, ముఖ్యంగా హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న ఒక ప్రకటనలో వెల్లడించారు.

Cold waves: yellow alert in hyderabad.. falling temperatures less than 11degrees

మంచు ప్రభావం ముఖ్యంగా సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్, చార్మినార్, ఖైరతాబాద్ జోన్ లలో ఎక్కువగా ఉండొచ్చు అని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక విపరీతంగా మంచు కురిసే అవకాశం ఉన్న కారణంగా వాహనదారుల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పొగ మంచు కారణంగా ఉదయం వేళల్లో, అలాగే సాయంత్రం పూట ఎదురుగా వచ్చే వాహనాలు అస్పష్టంగా కనిపించే అవకాశం ఉందని, ఫలితంగా యాక్సిడెంట్లు జరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. మంచు ఎక్కువగా కురిసే అవకాశం ఉన్న కారణంగా ఆరోగ్యం విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆస్తమా, సైనసైటిస్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారు బయటకు వెళ్ళకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు.

English summary
Cold shakes Telangana. Meteorological department has issued yellow alert for Hyderabad. It suggests being alert in the face of falling temperatures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X