స్టేషన్ చుట్టూ అర్ధనగ్నంగా తిప్పిన పోలీసులు: విద్యార్ధి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: పోలీసుల వేధింపులు తాళలేక మరో విద్యార్ధి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మొబైల్ చోరీ కేసులో గురువారం ఆత్మహత్యకు పాల్పడిన తరుణ్ యాదవ్ స్నేహితుడు ముఖేష్ శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు.
వెంటనే అతడిని కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వేధింపులు తాళలేకే ముఖేష్ అత్మహత్యకు పాల్పడ్డాడని అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే సుశీల్ అనే స్నేహితుడు ఇచ్చిన పార్టీకి తరుణ్ యాదవ్, ముఖేష్‌లు వెళ్లారు.
ఈ క్రమంలో సుశీల్‌కు చెందిన మొబైల్ పోయింది. దీంతో సుశీల్ పోలీసులను ఆశ్రయించాడు. తన మొబైల్ పోయిన సమయంలో తరుణ్, ముఖేష్ ఉన్నారని, వారిపైనే అనుమానంగా ఉందని తెలిపాడు. దీంతో పోలీసులు వారిద్దరిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.

మొబైల్ చోరీ విషయంలో తీవ్ర మనస్థాపానికి గురైన తరుణ్ గురువారం ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నారు. కాగా మొబైల్ చోరీ కేసులో లాలాగూడ పోలీసులు ముఖేష్, తరుణ్ యాదవ్‌ను చితకబాదారు. అంతేకాకుండా స్టేషన్ చుట్టూ అర్దనగ్నంగా తిప్పించారు. దీంతో ముఖేశ్ శుక్రవారం యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ కాలేజీ ఉపాధ్యాయుడు మృతి
హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దూలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications