వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థులకు తప్పనున్న తిప్పలు.. ఏడు యూనివర్సిటీలకు కామన్ ఎంట్రెన్స్..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : యూనివర్సిటీల్లో అడ్మిషన్లకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇబ్బందులు తొలగించేందుకు ఒకే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం తొలిసారికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. 10 డిప్లొమా కోర్సులతో కలిపి మొత్తం 60 సబ్జెక్టులకు సీపీజీఈటీ నిర్వహించాలని నిర్ణయించారు.

ఇంటర్ బోర్టు రద్దు..! కేంద్రం తరహాలో 12 వరకు ఒకే సంస్థ..! అంగీకారం తెలిపిన సీఎం..?ఇంటర్ బోర్టు రద్దు..! కేంద్రం తరహాలో 12 వరకు ఒకే సంస్థ..! అంగీకారం తెలిపిన సీఎం..?

7 వర్సిటీలకు సీపీజీఈటీ

7 వర్సిటీలకు సీపీజీఈటీ

తెలంగాణలో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్టీయూ యూనివర్సిటీలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ వర్సీటీల్లో కొన్ని పీజీ అడ్మిషన్ల కోసం వేర్వేరుగా ఎంట్రన్స్ టెస్టులు నిర్వహిస్తున్నాయి. అయితే ఈసారి నుంచి వీటన్నింటికీ ఉమ్మడిగా ప్రవేశపరీక్ష నిర్వహించనున్నరు.

ఉస్మానియాకు బాధ్యతలు

ఉస్మానియాకు బాధ్యతలు

తొలిసారి నిర్వహిస్తున్న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వాహణ బాధ్యతను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించారు. సీపీజీఈటీ ఛైర్మన్‌గా ఓయూ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ రామచంద్రం, కన్వీనర్‌గా పీజీ అడ్మిషన్స్ ప్రొఫెసర్ కిషన్ వ్యవహరిస్తున్నారు. పాత పది జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 4 సెంటర్ల చొప్పున పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు.

విద్యార్థులకు తప్పనున్న ఇబ్బందులు

విద్యార్థులకు తప్పనున్న ఇబ్బందులు

తెలంగాణలోని 7 యూనివర్సిటీల్లో మొత్తం 30 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఉస్మానియాతో పాటు మహాత్మాగాంధీ, తెలంగాణ, పాలమూరు యూనివర్సిటీలు ఓయూ పీజీ సెట్ ఆధారంగా అడ్మిషన్లు ఇచ్చేవి. కేయూ పరిధిలో శాతవాహన వర్సిటీ ఉండగా.. జేఎన్‌టీయూ విడిగా కామన్ పీజీ ఎంట్రెన్స్ నిర్వహించుకునేవి. దీంతో ఆయా యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం విద్యార్థులు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఇలా దరఖాస్తు నుంచి సీట్ల కేటాయింపు వరకు విద్యార్థులు వ్యయ ప్రయాసలకు లోనయ్యేవారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షతో ఈ ఇబ్బందులన్నీ తీరనున్నాయి. సీపీజీఈటీ రాసిన విద్యార్థులు ఏ యూనివర్సిటీలో అయినా అడ్మిషన్ తీసుకునే అవకాశంఉంటుంది.

ఏప్రిల్ 29న నోటిఫికేషన్

ఏప్రిల్ 29న నోటిఫికేషన్

కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్‌కు సంబంధించి ఏప్రిల్ 29న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆ రోజు నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 14 నుంచి వారం రోజుల పాటు ఎగ్జామ్ నిర్వహించి పది రోజుల్లో ఫలితాలు విడుదల చేయనున్నారు. జులైలో కౌన్సిలింగ్ నిర్వహించి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

English summary
A common entrance test for post-graduate admissions will be held for 7 universities in telangana. the entrance test for admission into master of arts, commerce and science shall be conducted by osmania university. the OU vice chancellor prof S Ramachandram was appointed as the chairman of the test.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X