హైదరాబాద్‌లో త్వరలో కామన్ మొబిలిటీ కార్డు: మెట్రో, ఆర్టీసీ సేవలన్నింటికీ ఒకటే
హైదరాబాద్: నగరంలో పౌరులకు కామన్ మొబిలిటీ కార్డు తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రజా రవాణా వ్యవస్థ ఒక గొడుగు తెచ్చేందుకు ఒక కామన్ మొబిలిటీ కార్డును తీసుకొచ్చే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. మొదట హైదరాబాద్ నగరంలో ప్రధానమైన ప్రజా రవాణా మార్గాలుగా ఉన్న మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించేలా ఈ కార్డును తీసుకురానున్నారు.
మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్, శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన సమావేశంలో కామన్ మొబిలిటీ కార్డుపై చర్చించారు. ఆర్టీసీ, మెట్రో రైలు సంస్థల ఉన్నతాధికారులు కార్డుకు సంబంధించిన వివరాలు అందించారు. మొదట మెట్రో రైల్, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి వీలుగా కార్డును జారీ చేస్తామన్నారు. ఆ తర్వాత ఇదే కార్డుతో భవిష్యత్తులో ఎంఎంటీఎస్, క్యాబ్ సేవలు, ఆటోలను కూడా వినియోగించుకునేలా విస్తారమని మంత్రులు వెల్లడించారు.

పౌరులు తమ ఇతర కార్డుల తరహాలో రిటైల్ దుకాణాల్లో కొనుగోళ్లకు కూడా వినియోగించేలా 'వన్ కార్డ్ ఫర్ ఆల్ నీడ్స్' మాదిరి ఉండాలని మంత్రులు అధికారులకు సూచించారు. ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నగరం వరకు ఈ కార్డు జారీ ఉంటుందని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కార్డు సేవలు అందేలా విస్తరించడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులను ఆదేశించారు.
అంతేగాక, దేశ వ్యాప్తంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ వినియోగించేందుకు అవకాశం ఉన్న ప్రతి ఏటా వినియోగించుకునే అవకాశం ఉండాలని మంత్రులు తెలిపారు. దీంతో ఇతర మెట్రో నగరాలకు వెళ్లినప్పుడు కూడా అక్కడి ఆర్టీసీ బస్సులు, మెట్రో రైల్, ఇతర ప్రజా రవాణా వ్యవస్థను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకునేందుకు వీలు కలుగుతుందని అన్నారు.
To enhance the experience of commuting through public transportation in Hyderabad city, Telangana government announced the introduction of a Common Mobility Card.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 20, 2023
Initially, it will facilitate travel via Metro Rail and @TSRTCHQ buses, with plans to extend its usability to MMTS,… pic.twitter.com/WKhXDEhGYe
ఈ కార్డును ప్రయోగాత్మకంగా ఆగస్టు రెండో వారంలోగా హైదరాబాద్ నగర పౌరులకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఇందుకోసం మెట్రో రైల్, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేయనున్న ఈ కామన్ మొబిలిటీ కార్డుకు ఒక పేరు సూచించాలని కోరారు.












Click it and Unblock the Notifications