• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ శాతంపై ఆందోళన..వలస పోయిన వారు ఓట్లు వేసేందుకు వస్తారా ?

|

తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్నదాతలను కుదేలు చేసింది. గ్రామాలకు గ్రామాలనే ఖాళీ చేసి వెళ్ళిపోయేలా చేసింది. కరవు రక్కసి కరాళ నృత్యం చేసిన చేసిన గ్రామాల్లో ప్రజలు పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలస పోయారు. అలా వలస పోయిన గ్రామస్తులను ఎన్నికల సందర్భంగా తిరిగి ఊర్లకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు నేతలు.

విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ...టోల్ పన్నులు రద్దు చెయ్యాలంటూ పంతంగి టోల్ ప్లాజాపై దాడి

వలసపోయిన గ్రామస్తులు .. పోలింగ్ పర్సంటేజ్ పై అధికారులలో టెన్షన్

వలసపోయిన గ్రామస్తులు .. పోలింగ్ పర్సంటేజ్ పై అధికారులలో టెన్షన్

ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి, జహీరాబాద్ ,నారాయణఖేడ్, ఆందోల్, మెదక్, నర్సాపూర్, గజ్వేల్ నియోజక వర్గాల్లో చాలా మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు ప్రజలు. ఈ నియోజకవర్గాల్లో ప్రస్తుతం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ శాతం పై అధికారుల్లో ఆందోళన నెలకొంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో, సాగునీటి సమస్యలతో ఇక్కట్లు ఎదుర్కొన్న పలు గ్రామాల ప్రజలు వలస పోయారు. వారంతా ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో నేతలు గ్రామాలకు రావాలని ఆహ్వానిస్తున్నా పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో పోలింగ్ పర్సంటేజ్ పై అధికారుల్లో టెన్షన్ నెలకొంది.

గత ఎన్నికల్లో వాహనాలు పెట్టి మరీ రప్పించిన అభ్యర్థులు

గత ఎన్నికల్లో వాహనాలు పెట్టి మరీ రప్పించిన అభ్యర్థులు

విపరీతంగా మండుతున్న ఎండలు దానికి తోడు బాగా పెరిగి పోయిన వలసలు, ఎవరు వచ్చినా తమ బతుకులు మారవు అనే నిర్లిప్తత వెరసి పోలింగ్ పర్సంటేజ్ తక్కువ నమోదు అవుతుంది అన్న భావన నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో అభ్యర్థులు వాహనాలను ఏర్పాటు చేసి ఇతర ప్రదేశాలలో ఉన్న వారిని గ్రామానికి రప్పించి ఓటు వేసేలా చూశారు.

ఈ ఎన్నికల్లో వలస ఓటర్లపై ఆసక్తి చూపని నేతలు .. ఓటు కోసం వస్తారో రారో తెలీని గ్రామస్తులు

ఈ ఎన్నికల్లో వలస ఓటర్లపై ఆసక్తి చూపని నేతలు .. ఓటు కోసం వస్తారో రారో తెలీని గ్రామస్తులు

కానీ ఈ దఫా అభ్యర్థులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. దీంతో వలస వాసులు కూడా గ్రామాలకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఇక వీటన్నిటి ప్రభావం కచ్చితంగా పోలింగ్ మీద పడే అవకాశం వుంది . ఇక అధికారులు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రచారం చేసి చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పటికీ ఎంతమంది గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకుంటారు అన్నది మాత్రం రేపు తేలనుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The severe drought situation has forced the villagers to leave villages in the united Medak district . Due to drought where the people migrated to the towns to survive. So the migrant villagers are trying to bring back from the towns for the elections. It is to be seen how many will participate in the polling tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more