"శ్రీనివాస్ హత్య సూత్రధారి టిఆర్ఎస్ ఎమ్మెల్యే వీరేశం"
Recommended Video

నల్లగొండ: నల్లగొండ చైర్‌పర్సన్ భర్త, కాంగ్రెసు నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎమ్యెల్యే వీరేశంను కాంగ్రెసు నాయకులు నిందిస్తున్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను శుక్రవారం కాంగ్రెసు నేతలు పరామర్శించారు.
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత కె. జానారెడ్డి, ఇతర నాయకులు షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బూడిద బిక్షమయ్య శ్రీనివాస్ భార్య, మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మిని ఓదార్చారు.

హత్యకు సూత్రధారి వీరేశం
శ్రీనివాస్ దారుణ హత్యకు ఖండిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అది ప్రభుత్వ హత్య అని ఆయన ఆరోపించారు. శ్రీనివాస్ హత్యకు సూత్రధారి నకిరేకల్ శాసనసభ్యుడు వీరేశం అని ఆయన ఆరోపించారు.

సిఎంకు విన్నవించుకున్నా..
ప్రాణభయం ఉందని శ్రీనివాస్ దంపతులు గతంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్కు విన్నవించుకున్నారని ఆయన చెప్పారు. హత్య జరిగి 48 గంటలు గడిచినప్పటికీ పోలీసులు నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. నేర చరిత్ర ఉన్న తెరాస నాయకులను కేసీఆర్ వెనకేసుకొస్తున్నారని ఆయన విమర్శించరు.

కాంగ్రెసు పార్టీని దెబ్బ తీసేందుకే..
బలంగా ఉన్న కాంగ్రెసు పార్టీని దెబ్బ కొట్టేందుకే రాజకీయ హత్యలకు పాల్పడుతున్నారని జానా రెడ్డి ఆరోపించారు. పోలీసులు శ్రీనివాస్ కాల్ డేటాను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం హింసను ప్రేరేపిస్తోందని ఆయన మండిపడ్డారు.

సిబిసిఐడి విచారణ జరిపించాలని డిమాండ్
శ్రీనివాస్ హత్య కేసును సిబిసిఐడికి ప్పగిస్త వాస్తవాలు బయటకు వస్తాయని జానా రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి కాంగ్రెసు పార్టీ అండా ఉంటుందని ఆయన చెప్పారు.

హత్యలో వీరేశం హస్తం
శ్రీనివాస్ హత్యలో ఎమ్మెల్యే వేముల వీరేశం హస్తం ఉందని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు ఆరోపించారు. నయీంలా వీరేశంను ఎందుకు ఎన్‌కౌంటర్ చేయలేదని ఆయన అడిగారు. కెసీఆర్ పతనం నల్లగొండ నుంచే ప్రారంభమైందని ఆయన వ్యాఖ్యానించారు. డిఎస్పీ సుధాకర్‌ను విధుల నుంచి తప్పించాలని మరో కాంగ్రెసు నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కాంగ్రెసు కార్యకర్తలు అధైర్యపడవద్దని ఆయన సూచించారు.

అక్కడున్నట్లు సమాచారం
శ్రీనివాస్ హత్య విషయంలో ఎమ్మెల్యే వీరేశంపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను హత్య చేసినవారు ఊట్కూరులో ఉన్నట్లు సమాచారం ఉందని ఆయన అన్నారు. శ్రీనివాస్‌కు నాలుగేళ్ల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆన అన్నారు. రక్షణ కోసం సిఎంను, ఐజిని కలిశామని, అయినా రక్షణ కల్పించలేదని ఆయన చెప్పారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications