జూబ్లీహిల్స్ ఎన్నిక వేళ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ బ్రహ్మాస్త్రం, కీలక మలుపు..!!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కీలక మలుపు. జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు హోరా హోరీగా తల పడుతున్నాయి. మూడు పార్టీలకు గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇప్పటి కే మూడు పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్ధుల నామినేషన్లతో గడువు ముగిసే సమయానికి 211 మంది అభ్యర్ధులు 321 నామినేషన్లు దాఖలు చేసారు. ఇదే సమయం లో కాంగ్రెస్ తాజా నిర్ణయం రాజకీయంగా బీఆర్ఎస్ కు అస్త్రంగా మారుతోంది. మరో ఉప ఎన్నికకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.

జూబ్లీహిల్స్ లో పార్టీ ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ పేరు చేర్చారు. ఇదే ఇప్పుడు కీలకంగా మారుతోంది. అటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ స్పీకర్ అనర్హత పిటీషన్ల పైన నిర్ణయం ఈ నెల 31వ తేదీ లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Congress announces danam nagender as Jubilee hills star campaigner leader to new controversy

ఇప్పటికే స్పీకర్ విచారణ పూర్తి చేసారు. ఈ సమయంలో స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో జూబ్లీహిల్స్ లో పట్టు ఉన్న దానం నాగేందర్ పేరు చేర్చటం పైన బీఆర్ఎస్ స్థానిక ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. కోర్టు లోనూ అధికారికంగా దానం పైన చర్యలకు వీలుగా తమకు అస్త్రం అందిందని చెబుతోంది. తాజా గా కేటీఆర్ సైతం ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ఎద్దేవా చేశారు.

తమ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయిన అయిన దానం నాగేందర్‌ పేరు కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో ఉండటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు తాము ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకునే ధైర్యం లేదని అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోలేదని చెప్తున్న కాంగ్రెస్‌ తమ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో ఎలా చేర్చిందని ప్రశ్నించారు. దానం పేరు జాబితాలో చేర్చటం ద్వారా కాంగ్రెస్ సైతం మరో ఉప ఎన్నికకు సమాయత్తం అవుతుందా అనే చర్చ మొదలైంది.

దానం పైన తాము ఇప్పటికే అన్ని ఆధారాలు సిద్దం చేసామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. దీంతో.. జూబ్లీహిల్స్ లో తొలి దెబ్బ.. ఖైరతాబాద్ లో రెండో దెబ్బ కొడతామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేసారు. కాగా.. ఇప్పుడు దానం సైతం ఎన్నికలకు సిద్దపడే నిర్ణయాలు తీసుకొంటున్నారనే వాదన ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నిక వేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ రాజకీయాలను టార్గెట్ చేస్తూ ప్రచారం కొనసాగిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+