సొలిటికల్ హీట్: ఆ పార్టీలకు తెలంగాణపైనే దృష్టి, ఎందుకంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల కోసం కాంగ్రెస్, బిజెపిలు సన్నాహాలు చేస్తున్నాయి. అధికారంలో ఉన్న టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఆ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఎన్నికలకు ముందే ఆ పార్టీ మ్యానిఫెస్టోను ప్రకటించాలని భావిస్తోంది.నల్గొండ ఘటన తర్వాత ఆ పార్టీ మరింత దూకుడును ఆ పార్టీ పెంచింది.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బిజెపి కూడ పావులు కదుపుతోంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన తర్వాత తెలంగాణలో మార్పుులు చేర్పులు ఉంటాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

రాష్ట్రంలో మూడు రోజుల పాటు అమిత్ షా పర్యటించనున్నారు. బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసే విషయమై చర్చించనున్నారు.ఈ మేరకు ప్రత్యేక వ్యూహంతో ఆ పార్టీ ముందుకు వెళ్ళనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress and Bjp national leaderships targeted Telangana state.Bjp national president Amit shah will tour in Telanagna state on May 22. Aicc vice president Rahulgandhi will tour in Telangana state on June 1
Please Wait while comments are loading...