కేసీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ వ్యూహాత్మక దాడి; బీఆర్ఎస్ ఖేల్ ఖతం.. దుకాణం బంద్?
తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దకాలంగా ఒక వెలుగు వెలిగిన కేసీఆర్ కు బిజెపి, కాంగ్రెస్ చుక్కలు చూపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుసగా కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నాయి. దెబ్బ మీద దెబ్బ కొడుతూ కేసీఆర్ ను కుదేలు చేస్తున్నాయి. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నా మాటే శాసనం ఉన్నట్టు నడిచిన కేసీఆర్ మాట ఇప్పుడు సొంత పార్టీలో కూడా చెల్లుబాటు కాని పరిస్థితి వచ్చింది.
ఈ పరిస్థితులకు కారణం బీజేపీ, కాంగ్రెస్ లు అదును చూసి కేసీఆర్ ని దెబ్బ కొట్టడం అనే చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన కేసీఆర్ ఈసారి లోక్సభ ఎన్నికలలో సత్తా చాటి పార్టీకి పునర్ వైభవాన్ని తీసుకురావాలని ప్రయత్నం చెయ్యాలనుకున్నారు. కానీ డ్యామిడ్ కథ అడ్డం తిరిగింది అన్నట్టు కెసిఆర్ అనుకున్నది ఒకటైతే, జరుగుతున్నది మాత్రం వేరేగా ఉంది.

అసలే ఓటమి నుండి ఇంకా కోలుకోని కెసిఆర్ కు లోక్సభ ఎన్నికలు అగ్ని పరీక్షలా మారాయి. ఇక లోక్సభ ఎన్నికల సమయంలో కేసీఆర్ ను ఊపిరాడని ఇవ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేయాలని నిర్ణయించుకున్న బిజెపి, కాంగ్రెస్ లు వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ టాపింగ్ కేసుతో కాంగ్రెస్ పార్టీ కెసిఆర్ ను టార్గెట్ చేస్తుంటే, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్టుతో బిజెపి కేసీఆర్ ను టార్గెట్ చేస్తోంది.
ఈ కేసులపైన ప్రతిపక్షాల దాడిని ఎదుర్కోవటానికి అష్ట కష్టాలు పడుతున్న వేళ, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను చేరికల పేరుతో ఆపరేషన్ ఆకర్ష అంటూ పార్టీలో చేర్చుకుంటూ ఊహించని దెబ్బ కొడుతున్నాయి. రెండు పార్టీల వ్యూహాలతో కెసిఆర్ ప్రస్తుతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఇక తాజా పరిణామాలతో కెసిఆర్ ఖేల్ ఖతం.. దుకాణం బంద్ అని అటు రాజకీయ వర్గాలలోను, ఇటు ప్రజలలోను చర్చ జరుగుతుంది. అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ ఎవరినీ లెక్క చేయలేదు.. అధికారం లేకుంటే కేసీఆర్ పరిస్థితి చూడు ఎలా మారిందో అన్నది ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఏది ఏమైనా లోక్సభ ఎన్నికలు ఇప్పుడు రావడం నిజంగా కెసిఆర్ కు గండంగా మారిందని, ఇప్పుడు ఉన్న పరిస్థితులను కెసిఆర్ ఎదుర్కోవడం కష్టమే అన్న చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications