Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎర్రబెల్లి దయాకర్ రావుపై కాంగ్రెస్ చార్జ్ షీట్ కలకలం!!

వరంగల్ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్ధి ఎర్రబెల్లి దయాకర్ రావుపై కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన చార్జీ షీట్ రాజకీయ వర్గాలలో తీవ్ర కలకలం రేపుతోంది. దగా కోర్ దయాకర్ రావు' పనేదైనా, పథకమేదైనా, 30% వాటా అంటూ పేర్కొన్న తొమ్మిది ఆరోపణలతో కూడిన చార్జీ షీట్‌ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.

ఈ చార్జిషీట్ లో ఆయన తీసుకుంటున్న కమిషన్ కారణంగా ఆగిపోయిన పనులు, గత ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేయని కార్యక్రమాలను ప్రస్తావించారు. 'దయాకర్ రావు అక్రమాలు' అంటూ ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన చార్జీ షీట్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. దందాల దయాకర్ రావుపైన పోరు చేద్దాం. పాలకుర్తి అసెంబ్లీని పరిరక్షించుకుందాం అంటూ' నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.

Congress charge sheet against Errabelli Dayakar Rao; to defeat in palakurthy!!

తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ ను తక్కువ చేసి ఆడుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ తర్వాత ఆయన పంచన చేరి ఏకంగా మంత్రి అయ్యారని ఆరోపించారు. పాలకుర్తి నియోజకవర్గం చెన్నూరు రిజర్వాయర్‌ను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ 360 కోట్లు కేటాయిస్తే, మంత్రి ఎర్రబెల్లి దాన్ని 700 కోట్లకు పెంచి 250 కోట్ల కమీషన్ తీసుకున్నాడని కాంగ్రెస్ ఆరోపించింది.

నియోజకవర్గంలో సర్వే నెం.76 ని 56 గా మార్చి గిరిజనుల 50 ఎకరాల భూమి కాజేసిండని మరో ఆరోపణ చేసింది . నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలకు నిధులివ్వాలని సర్పంచులు కోరితే మందు బాటిళ్లు అమ్ముకోండని మంత్రి ఉచిత సలహా ఇచ్చాడని మండి పడ్డారు.. మంత్రి ఎర్రబెల్లి కమీషన్ల కారణంగా తొర్రూర్ మండలంలో తాగునీటి ప్రాజెక్టుల పనులు ఆగినాయని పేర్కొన్నారు.

Congress charge sheet against Errabelli Dayakar Rao; to defeat in palakurthy!!

అర్హులకు కాకుండా 30% కమీషన్ తో తన అనుచరులకే దళిత బంధు ఇచ్చారని, పాలకుర్తి మండలంలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తానని మోసం చేయడంతో పాటు. డిగ్రీ కళాశాల కట్టించకుండా దగా చేశారని విమర్శించారు. 2018లో డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన చేసి ఇప్పటి వరకు పూర్తి చేయలేదని, పేదల సొంతింటి కల నెరవేర్చడంలో కూడా ఎర్రబెల్లి విఫలం అయ్యారని ఆరోపించింది.

మంచుప్పులలో దళితులకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లు నివాస యోగ్యంగా లేవని, అధ్వానంగా ఉన్నాయని కాంగ్రెస్ విమర్శించింది.. కొడకండ్ల మండలంలో పద్మశాలీలకు ఉపాధి కోసం ఉద్దేశించిన టెక్స్ట్ టైల్ పార్కు నిర్మిస్తానని, సంఘం సభ్యులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిండా ముంచాడని ఆ‌రోపించారు.ఇన్ని రకాల ఆరోపణతో ఛార్జ్ షీట్ విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో ఆయనను ఓడించి పాలకుర్తి నియోజకవర్గాన్ని కాపాడుకుందామని పిలుపు నిచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+